amp pages | Sakshi

టీమిండియా పరువు కాపాడిన కేఎల్‌ రాహుల్‌.. ఆ జాబితాలో ఒకే ఒక్కడు..!

Published on Wed, 04/13/2022 - 18:51

దుబాయ్‌: ఐసీసీ బుధవారం (ఏప్రిల్‌ 13) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ క్రికెటర్ల హవా కొనసాగగా.. టీమిండియా ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. పాక్‌ ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటగా.. భారత క్రికెటర్లు క్రితంతో పోలిస్తే తమతమ ర్యాంకులను దారుణంగా కోల్పోయి టాప్‌ 10లో కనిపించకుండాపోయారు. బ్యాటింగ్‌ విభాగంలో పాక్‌ కెప్టెన్‌ బాబార్‌ ఆజమ్‌ (818) అగ్రస్థానాన్ని, అదే జట్టు స్టార్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (794) మూడో స్థానాన్ని పదిలం చేసుకోగా, ఈ విభాగంలో టాప్‌ 10లో (పదో ర్యాంక్‌) ఉన్న ఏకైక భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ (646) టీమిండియా పరువు కాపాడాడు. 


ఈ జాబితాలో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎయిడెన్ మార్క్రమ్‌ (796) రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంగ్లండ్‌ ఆటగాడు డేవిడ్‌ మలాన్‌ (728), కివీస్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (703), ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (692), సౌతాఫ్రికా నయా సెన్సేషన్‌ డస్సెన్‌ (669), న్యూజిలాండ్‌ వెటరన్‌ ఓపెనర్‌ గప్తిల్‌ (658), శ్రీలంక ప్లేయర్‌ పథుమ్‌ నిస్సంక (654) వరుసగా 4 నుంచి 9 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా నుంచి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 633 రేటింగ్‌ పాయింట్లతో 14వ స్థానంలో ఉండగా, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ 16, 19 స్థానాల్లో నిలిచారు. 


బౌలింగ్, ఆల్‌రౌండర్ కేటగిరీల విషయానికొస్తే.. ఈ రెండు విభాగాల టాప్‌ 10 జాబితాల్లో టీమిండియా ఆటగాళ్లు కనుమరుగైపోయారు. బౌలింగ్ కేటగిరీలో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ తబ్రేజ్ షంషీ 784 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. ఆదిల్ రషీద్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా, రషీద్ ఖాన్, వనిందు హసరంగ, ఎన్రిచ్ నోర్జే, ముజీబుర్ రెహ్మాన్, నసుమ్ అహ్మద్, షాహీన్ అఫ్రిది టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. టీమిండియా నుంచి భువనేశ్వర్ కుమార్ (586 పాయింట్లతో 18వ స్థానం) అత్యుత్తమ ర్యాంకింగ్‌ సాధించాడు. 

ఆల్‌రౌండర్ల విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విభాగపు టాప్‌ 10లోనూ టీమిండియా నుంచి ఒక్కరికీ చోటు దక్కలేదు. అఫ్ఘనిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్ నబీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షకీబుల్ హసన్, మొయిన్ అలీ, జేజే స్మిట్‌, లియామ్ లివింగ్‌స్టొన్, రోహన్ ముస్తపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జీషన్ మక్సూద్, ఎయిడెన్ మార్క్రమ్‌, దీపేంద్ర టాప్‌ 10లో ఉన్నారు. ఈ విభాగపు టాప్ 20లో కూడా టీమిండియా నుంచి ఒక్కరూ లేరు.
చదవండి: సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. సుందర్‌ స్థానాన్ని భర్తీ చేయనున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)