NZ Vs IRE: హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టిన ఐర్లాండ్‌ బౌలర్‌..

Published on Fri, 11/04/2022 - 11:53

టీ20 ప్రపంచకప్‌-2022లో రెండో హ్యాట్రిక్‌ నమోదైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ పేసర్‌ జాషువా లిటిల్‌ హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టాడు. కివీస్‌ ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ వేసిన లిటిల్‌ రెండో బంతికి విలియమ్సన్‌, మూడో బంతికి నీషమ్‌, నాలుగో బంతికి శాంట్నర్‌ పెవిలియన్‌కు పంపాడు.  

తద్వారా తన కెరీర్‌లో తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో హ్యాట్రిక్‌ వికెట్లు సాధించిన రెండో ఐరీష్‌ బౌలర్‌గా లిటిల్‌ రికార్డులకెక్కాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌ బౌలర్‌ కుర్టిస్‌ కాంఫియర్‌ హాట్రిక్‌ వికెట్లు సాధించాడు. ఇక ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టిన ఆరో బౌలర్‌గా లిటిల్‌ నిలిచాడు. కాగా ఈ ఏడాది ప్రపంచకప్‌లో శ్రీలంకపై యూఏఈ స్పిన్నర్‌ కార్తీక్‌ మెయప్పన్‌ తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు.

హాఫ్‌ సెంచరీతో చెలరేగిన విలియమ్సన్‌
ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ విలియమ్సన్‌ 61 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు అలెన్‌(32), మిచెల్‌(31) పరుగులతో రాణించారు. ఐరీష్‌ బౌలర్లలో లిటిల్‌ మూడు, డెలానీ, అడైర్‌ తలా వికెట్‌ సాధించారు.


చదవండి: T20 WC 2022: 4 సెమీస్‌ బెర్తులు.. 9 జట్ల మధ్య పోటీ! ఆరోజే అసలు మ్యాచ్‌లు..

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)