amp pages | Sakshi

SRH VS RR: సంజు శాంసన్ ఖాతాలో అరుదైన రికార్డు..

Published on Tue, 03/29/2022 - 16:08

Sanju Samson: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 29) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ స్కిప్పర్‌ సంజూ శాంసన్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలువనుంది. ఈ మ్యాచ్‌ శాంసన్‌కు రాజస్థాన్ రాయల్స్ తరఫున వందో మ్యాచ్‌ కానుంది. గతంలో అజింక్య రహానే ఒక్కడే ఆర్‌ఆర్‌ తరఫున ఈ ఘనత సాధించాడు. 2013లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన శాంసన్‌ ఇప్పటి వరకు 121 మ్యాచ్‌ల్లో 3 శతకాలు, 15 అర్ధశతకాల సాయంతో 134.21 సగటున 3068 పరుగులు చేశాడు. 

ఇదిలా ఉంటే, ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగే మ్యాచ్‌లో శాంసన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు కొన్ని అరుదైన మైలురాళ్లపై కన్నేశారు. 

  • ఆర్‌ఆర్‌లో కొత్తగా చేరిన దేవ్‌దత్ పడిక్కల్ మరో ఐదు ఫోర్లు కొడితే 100 బౌండరీల మార్కును అందుకోనుండగా..
  • ఆర్‌ఆర్‌ వికెట్‌కీపర్‌ జోస్ బట్లర్ మరో 32 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 2000 పరుగుల మార్క్‌ను చేరుకుంటాడు. అలాగే బట్లర్‌ (194) మరో 6 ఫోర్లు బాదితే ఐపీఎల్‌లో 200 బౌండరీల క్లబ్‌లో చేరతాడు. 
  • నాథన్ కౌల్టర్ నీల్‌ మరో రెండు వికెట్లు పడగొడితే 50 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. 
  • ప్రస్తుతం ఐపీఎల్‌లో 145 వికెట్లు పడగొట్టిన సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో 5 వికెట్లు పడగొడితే క్యాష్‌రిచ్‌ లీగ్‌లో అరుదైన150 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. 
  • టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 247 వికెట్లు పడగొట్టిన చహల్‌ మరో 3 వికెట్లు తీస్తే పొట్టి క్రికెట్‌లో 250 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. 
  • ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లు పూరన్‌ (295) మరో 5 సిక్సర్లు కొడితే టీ20ల్లో 300 సిక్సర్ల క్లబ్‌లో, అబ్దుల్‌ సమద్‌ (46) మరో 4 సిక్సర్లు కొడితే టీ20ల్లో 50 సిక్సర్ల క్లబ్‌లో చేరతారు. 
    చదవండి: ఎన్నడూ లేనంత బలంగా రాజస్థాన్‌.. ఏమాత్రం అంచనాలు లేకుండా ఎస్‌ఆర్‌హెచ్‌..!

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)