amp pages | Sakshi

IND vs WI 3rd ODI: మొన్న ప్రపంచ రికార్డు.. ఈరోజేమో మరీ ఘోరంగా!

Published on Fri, 02/11/2022 - 16:34

IND vs WI 3rd ODI: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆఖరి వన్డేలో నిరాశపరిచాడు. 6 పరుగులకే అవుటై పెవిలియన్‌ చేరాడు. విండీస్‌ బౌలర్‌ ఫ్యాబియన్‌ అలెన్‌ వేసిన బంతిని ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా ఆడేందుకు ప్రయత్నించిన సూర్య విఫలమయ్యాడు. బంతిని గాల్లోకి లేపగా బ్రూక్స్‌ రెండు చేతులతో ఒడిసిపట్టాడు. ఈ సూపర్‌ క్యాచ్‌తో సూర్య మైదానం వీడక తప్పలేదు.

కాగా రెండో వన్డేలో 83 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసిన సూర్యకుమార్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.  వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలి 6 మ్యాచ్‌లలో 30కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక మూడో వన్డేలో 7 బంతులు ఎదుర్కొన్న అతడు.. 6 పరుగులు(ఫోర్‌ 1) మాత్రమే చేయడం గమనార్హం. ఈ క్రమంలో.. ‘‘నువ్వు ఈ మ్యాచ్‌లో కూడా రాణిస్తావని అనుకుంటే.. మా ఆశలపై నీళ్లు చల్లావు కదా సూర్య’’ అంటూ అతడి ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా... ఇప్పటికే టీమిండియా వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నామమాత్రపు మూడో వన్డేలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(13), శిఖర్‌ ధావన్‌(10), కోహ్లి(డకౌట్‌), సూర్యకుమార్‌(6) విఫలం కాగా.. శ్రేయస్‌ అయ్యర్‌(80), రిషభ్‌ పంత్‌(56) అర్ధ సెంచరీలతో రాణించారు. 38 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసిన టీమిండియా బ్యాటింగ్‌ కొనసాగుతోంది. 

చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలం.. పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్‌!
Ind Vs Wi 3rd ODI- Virat Kohli Duck Out: ఏంటిది కోహ్లి.. 8, 18, 0... మరీ ఇంత చెత్తగా.. తుది జట్టులో ఉంటావా? లేదా?

Videos

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)