Ind vs Sa: కేఎల్‌ రాహుల్‌ అవుటైన తీరుపై వివాదం... కెప్టెన్ల మధ్య వాగ్వాదం.. వైరల్‌!

Published on Wed, 01/05/2022 - 13:54

KL Rahul Dean Elgar involved In Heated Exchange Day 2: దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఇరు జట్ల కెప్టెన్ల మధ్య స్వల్ప వివాదం చెలరేగింది. భారత తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మైదానాన్ని వీడుతున్న సమయంలో ప్రొటిస్‌ సారథి డీన్‌ ఎల్గర్‌తో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే... రెండో రోజు ఆటలో భాగంగా ఏడో ఓవర్‌లో మార్కో జాన్‌సెన్‌ వేసిన బంతిని షాట్‌ ఆడేందుకు రాహుల్‌ ప్రయత్నించాడు. 

కానీ.. అంచనా తప్పడంతో బ్యాట్‌ అంచును తాకిన బంతి ఎయిడెన్‌ మార్కరమ్‌(సెకండ్‌ స్లిప్‌) చేతుల్లో పడింది. దీంతో ఆతిథ్య జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే, మార్కరమ్‌ క్యాచ్‌ అందుకునే ముందు బంతి నేలను తాకిందని భావించిన రాహుల్‌ మైదానాన్ని వీడేందుకు ఇష్టపడలేదు. దీంతో అంపైర్లు మరోసారి చెక్‌ చేశారు. రివ్యూలో భాగంగా థర్డ్‌ ఎంపైర్‌ 2-డీ కెమెరాలో పరిశీలించగా ముందు నుంచి చూసినపుడు బంతి కింద మార్కరమ్‌ వేళ్లు ఉన్నట్లు కనిపించింది.

దీంతో నిరాశ చెందిన రాహుల్‌.. సీరియస్‌గా మైదానం నుంచి నిష్క్రమించాడు. ఆ సమయంలోనే ఎల్గర్‌తో చిన్నపాటి గొడవ జరిగినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న దృశ్యాల ద్వారా తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే... రెండో రోజు ఆటలో భాగంగానే శార్దూల్‌ వేసిన బంతికి ప్రొటిస్‌ ఆటగాడు డసెన్‌ అవుటైన తీరుపై ఇదే తరహాలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

చదవండి: Rassie van der Dussen Dismissal: శార్దూల్ బౌలింగ్‌లో ప్రొటిస్‌ ఆటగాడు అవుట్‌.. వివాదం!

జరిగింది ఇదీ!
శార్దుల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో డసెన్‌ బ్యాట్‌కు తగిలిన బంతిని కీపర్‌ రిషభ్‌ పంత్‌ అందు కొని అప్పీల్‌ చేశాడు. అంపైర్‌ ఎరాస్మస్‌ అవుట్‌గా ప్రకటించడంతో డసెన్‌ నిష్క్రమించాడు. ముుందునుంచి రీప్లే చూస్తే పంత్‌ క్యాచ్‌ అందుకునే ముందు బంతి నేలకు తాకినట్లుగా కనిపిస్తుండగా... భిన్నమైన కోణాల్లో రీప్లేలు చూసినప్పుడు మాత్రం దీనిపై స్పష్టత రాలేదు.

క్యాచ్‌ పట్టగానే బ్యాటర్‌ నడిచిపోగా ... ఇటు ఫీల్డ్‌ అంపైర్‌ అవుట్‌గా ప్రకటించేశాడు. విరామ సమయంలో దీనిపై తీవ్ర చర్చ జరిగింది. కెప్టెన్‌ ఎల్గర్, మేనేజర్‌ మసుబెలెలె మ్యాచ్‌ రిఫరీ వద్దకు వెళ్లి మాట్లాడారు. డసెన్‌ను వెనక్కి పిలిపించే అంశంపై మాట్లాడారా లేదా అనేది తెలియకున్నా, నిబంధనల ప్రకారమైతే అది సాధ్యమయ్యేది కాదు.    

చదవండి: WTC 2021-23 Points Table: టాప్‌-5లోకి బంగ్లాదేశ్‌... టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే!

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ