amp pages | Sakshi

Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం!

Published on Mon, 07/04/2022 - 11:17

India Vs England 5th Test: ‘‘257 పరుగుల ఆధిక్యం అంటే కాస్త కష్టమే! లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇంగ్లండ్‌ జట్టు చాలా కష్టపడాలి’’ అని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. ఇండియా మరో 150 పరుగులు చేస్తే అప్పుడు కొండంత లక్ష్యం ఆతిథ్య జట్టు ముందు ఉంటుందని.. స్టోక్స్‌ బృందానికి తిప్పలు తప్పవని పేర్కొన్నాడు. 

ఇంగ్లండ్‌- టీమిండియా మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఐదో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా సేన 416 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లలో జానీ బెయిర్‌ స్టో(106 పరుగులు) మినహా ఓపెనర్లు, మిడిలార్డర్‌ బ్యాటర్లంతా విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే కుప్పకూలింది.

పుజారా పట్టుదల!
ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్‌ గిల్‌ విఫలమైనా.. మరో ఓపెనర్‌ ఛతేశ్వర్‌ పుజారా అర్ధ శతకంతో రాణించాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది భారత్‌. దీంతో పర్యాటక జట్టుకు 257 పరుగుల ఆధిక్యం లభించింది.

ఈ నేపథ్యంలో మైకేల్‌ వాన్‌ క్రిక్‌బజ్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కఠినమైన పరిస్థితుల్లోనూ టీమిండియా నయా వాల్‌ పుజారా ఆడిన తీరు అమోఘమని ప్రశంసించిన వాన్‌.. అదే సమయంలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు మాత్రం పూర్తిగా విఫలమయ్యారని పెదవి విరిచాడు.


మైకేల్‌ వాన్‌(ఫైల్‌ ఫొటో)

టీమిండియాదే విజయం!
‘‘ఇలాంటి పిచ్‌ వాతావరణ పరిస్థితుల్లో పట్టుదలగా నిలబడి 139 బంతులు ఎదుర్కొని 50 పరుగులు(నాటౌట్‌) చేయడం అంత సులభమేమీ కాదు. నిలకడగా రాణిస్తూ ముందుకు సాగిన విధానం అమోఘం. పుజారా, పంత్‌ వంటి ఆటగాళ్లు ఉంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలే. వాళ్లిద్దరూ ఒక్కసారి పైచేయి సాధించారంటే అంతే సంగతులు.

ఇప్పుడు 257 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈజీగా మరో 150 పరుగులు చేస్తుంది. అప్పుడు టార్గెట్‌ ఇంచుమించు 400. మిగిలింది రెండ్రోజుల ఆట. ఇంగ్లండ్‌ గెలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది’’ అని మైకేల్‌ వాన్‌ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియానే విజయం వరిస్తుందని జోస్యం చెప్పాడు.

చదవండి: Ind Vs Eng 5th Test: వాళ్లేమో అదరగొడుతున్నారు.. వీళ్లేమో ఇలా.. ఛాన్స్‌ ఇస్తే జట్టులో పాతుకుపోవాలి! కానీ..
IND VS Northamptonshire: హర్షల్‌ ఆల్‌రౌండ్‌ షో.. రెండో మ్యాచ్‌లోనూ టీమిండియాదే విజయం

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)