amp pages | Sakshi

వర్కింగ్‌ డే రోజున ఐపీఎల్‌ ఫైనల్‌.. ఉద్యోగుల సిక్‌లీవ్స్‌ కష్టాలు!

Published on Mon, 05/29/2023 - 18:04

ఐపీఎల్‌ 16వ సీజన్‌కు ఆదివారంతోనే(మే 28న) శుభం కార్డు పడాల్సింది. కానీ వర్షం కారణంగా సీఎస్‌కే, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరగాల్సిన ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌ డే అయిన సోమవారానికి(మే 29) వాయిదా పడింది. మ్యాచ్‌కు ఈరోజు కూడా వర్షం ముప్పు ఉన్నప్పటికి అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.

ఈ విషయం సంతోషం కలిగించేదే అయినా.. సోమవారం వర్కింగ్‌ డే కావడంతో ఉద్యోగం చేసే కొంతమంది క్రికెట్‌ ప్రేమికులు మాత్రం తమ బాస్‌కు ఏం కారణం చెప్పి తొందరగా ఆఫీస్‌ నుంచి బయటపడాలా అని ఆలోచిస్తున్నారు.  సోమవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుండడంతో ఆలోగా ఇంటికి చేరుకునేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు.

అయితే నైట్‌షిఫ్ట్‌ సహా లేట్‌నైట్‌ వర్క్‌ చేసేవాళ్లు హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌కు సిక్‌లీవ్స్‌ కోసం అప్లై చేసుకుంటున్నారు. ఇక జియో సినిమా కూడా ఐపీఎల్‌ ఫైనల్‌ విషయమై ఒక ఫన్నీ మీమ్‌ను షేర్‌ చేసింది. హెచ్‌ఆర్‌ ఉద్యోగి ముందు కుప్పలుతెప్పలుగా సిక్‌ లీవ్‌ లెటర్స్‌ ఉండడం.. ఆమె దానిపై సంతకాలు చేస్తుండడం కనిపించింది. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. వాస్తవానికి మరి ఇంత ఎఫెక్ట్‌ ఉండకపోవచ్చు కానీ.. ఐపీఎల్‌ ఫైనల్‌ కావడంతో సాయంత్రం పనిచేసే ఆఫీసుల్లో మాత్రం ఉద్యోగుల నుంచి ఇలాంటి కారణాలు ఉండే అవకాశం ఉంటుంది.

అయితే ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరిగి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎప్పటిలాగే ఫుల్‌ ఎంజాయ్‌ చేసి సోమవారం కాస్త లేట్‌ అయినా ఆఫీస్‌కు వెళ్లేవారు. స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌ చూడలేనివాళ్లు ఫైనల్‌ మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేయాలని తమ ప్రణాళికలు రచించుకున్నారు. కొందరు పబ్‌లు, బార్లకు వెళ్లి మందు తాగుతూ మ్యాచ్‌ చూస్తూ చిల్‌ అవుదామనుకున్నారు. ఇంకొందరు ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఐపీఎల్‌ ఫైనల్‌ చూస్తూ ఆనందంగా గడిపేయాలనుకున్నారు.

కానీ వరుణుడు వారి ఆశలకు గండికొట్టాడు. దీంతో సోమవారానికి మ్యాచ్‌ వాయిదా పడింది.  కానీ సోమవారం వారంలో మొదటి పని దినం కావడం.. రోజంతా మీటింగ్స్‌ ఉంటాయన్న కారణంతో ఎక్కడ మ్యాచ్‌ మిస్‌ అవుతామేమోనన్న భయం సగటు క్రికెట్‌ అభిమానికి ఉంటుంది కదా..!

చదవండి: పన్నెండులో తొమ్మిదిసార్లు.. క్వాలిఫయర్‌-1 విజేత

#GTvsCSK: ఫైనల్‌ మ్యాచ్‌ వాయిదా.. ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి

Videos

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు

ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ

Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ

పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..

చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)