amp pages | Sakshi

సెల్‌ ఫోన్‌ డ్రైవింగ్‌ వీకెండ్‌లోనే ఎక్కువ.. ఎందుకంటే!

Published on Wed, 04/20/2022 - 14:57

చట్టాలు కఠినతరం చేస్తున్నా, జరిమానాలు భారీగా విధిస్తున్నా ట్రాఫిక్‌ ఉల్లంఘనలు ఆగడం లేదు. అడ్డదిడ్డంగా వాహనాలు నడపడం, సిగ్నల్స్‌ పట్టించుకోకపోవడం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవ్‌ చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌(ఐఐపీహెచ్), మరో రెండు స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. 

సెల్‌ ఫోన్‌ డ్రైవింగ్‌తో పరేషాన్‌
హైదరాబాద్‌లో 16.5 శాతం మంది దిచక్ర వాహన చోదకులు డ్రైవింగ్‌ చూస్తూ ఫోన్‌ మాట్లాడుతున్నారని అధ్యయనంలో తేలింది. వీరిలో 71.7 శాతం మంది ఫోన్‌ను చేతితో పట్టుకోకుండానే వాహనాలు నడుపుతున్నారు. అంటే ఇయర్‌ఫోన్స్‌, బ్లూటూత్‌ వినియోగిడం లేదా ఫోన్‌ను హెల్మెట్‌ లోపల పెట్టుకుని మాట్లాడుతున్నారన్న మాట. వీక్‌డేస్‌(35.49%)తో పోలిస్తే వారాంతాల్లో సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌(64.51%) చేసే వారే ఎక్కువగా ఉన్నారు. బిజీ రోడ్లలో 26.08%, రద్దీ లేని రహదారుల్లో 73.92% మంది దిచక్ర వాహనదారులు ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్‌ చేస్తున్నారు. రద్దీ సమయాల్లో పోలిస్తే(30.09%), రద్దీలేని సమయంలోనే (69.91%) ఈ ట్రెండ్‌ ఎక్కువగా కనబడుతోంది.

చట్టంలో సవరణలు చేయాలి
అధ్యయంలో భాగంగా మాదాపూర్‌ ఐటీ కారిడార్‌, అమీర్‌పేట, మేడ్చల్‌ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను వీడియో తీసి విశ్లేషించారు. ఏయే సమయాల్లో ఆయా రహదారులపై వాహనదారులు సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారనే విషయాన్ని లోతుగా పరిశీలించారు. ‘ఎక్కువ మంది వాహన చోదకులు హేండ్‌ ఫ్రీ మోడ్‌లోనే డ్రైవ్ చేస్తున్నారు. ఫోన్‌ మాట్లాడుతూ బండి నడిపే వారి సంఖ్య వీకెండ్‌లోనే అధికంగా ఉంటోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నాన్-బిజీ రోడ్లపై రద్దీ తక్కువగా సమయంలోనే సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ ఎక్కువగా కనబడుతోంది. వీక్‌డేస్‌తో పోలిస్తే ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేసే వారి సంఖ్య వారాంతాల్లో ఒకటిన్నర శాతం అధికంగా ఉన్నట్టు గుర్తించాం. చేతులతో ఫోన్‌ పట్టుకుని వాహనం నడిపేవారితో పాటు హేండ్‌ ఫ్రీ ఫోన్‌ డ్రైవింగ్‌ చేసే వారికి కూడా జరిమానాలు విధించేలా మోటార్‌ వెహికల్‌ చట్టంలో సవరణలు చేర్చాల’ని పరిశోధకులు కోరుతున్నారు. (క్లిక్: ఫోర్త్‌ వేవ్‌కు అవకాశాలు తక్కువ.. కానీ)

మూడేళ్లలో 85 వేల కేసులు
సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామని హైదరాబాద్‌ ట్రాఫిక్‌  పోలీసులు చెబుతున్నారు. గత మూడేళ్లలో 85,862 సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ ఏవి రంగనాథ్‌ తెలిపారు. ఫోన్‌ మాట్లాడుతూ.. వాహనాలు నడిపే వారిపై మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 184 కింద కేసులు నమోదు చేస్తామన్నారు. 85,862 కేసుల్లో దాదాపు 68,900 కేసులకు సంబంధించి జరిమానాలు వసూలయ్యాయని.. 16,782 జరిమానాలు పెండింగ్‌లో ఉన్నట్టు వెల్లడించారు. 2021లో 36,566 సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. (క్లిక్: మెడికల్‌ పీజీ ‘బ్లాక్‌’ దందా!)

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)