amp pages | Sakshi

మహా రాజకీయం.. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం

Published on Thu, 06/30/2022 - 00:59

ముంబై: సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం.. అంటే 2019 నవంబర్‌ 23న మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌తో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 8 గంటలకు రాజ్‌భవన్‌లో హడావుడిగా కొద్దిమంది సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కానీ, ఫడ్నవీస్‌ ప్రభుత్వం కేవలం దాదాపు 80 గంటలే మనుగడ సాగించింది. నవంబర్‌ 26న కుప్పకూలింది.

రెండు రోజుల తర్వాత.. నవంబర్‌ 28న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్‌ 22–23 అర్ధరాత్రి జరిగిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయి. శివసేన తన మిత్రపక్షం బీజేపీ నుంచి దూరమయ్యింది. మూడు దశాబ్దాల అనుబంధాన్ని తెంచేసుకుంది. సైద్ధాంతికంగా శత్రువులుగా భావించే కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టుకట్టింది. మూడు పార్టీలతో మహా వికాస్‌ అఘాడీ పేరిట కొత్త కూటమి ఏర్పాటయ్యింది. కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పింది. 

మహారాష్ట్రలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఐదేళ్లపాటు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఉమ్మడిగా ప్రయాణం సాగించాయి. 2019లో కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాల్లో విజయం సాధించాయి. ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ–శివసేన మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సీఎం పోస్టు తమకే దక్కాలంటూ ఇరుపక్షాలు భీష్మించుకు కూర్చున్నాయి. శివసేన పట్టు వీడకపోవడంతో బీజేపీ పాచిక విసిరింది.

ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్‌ పవార్‌ సోదరుడి కుమారుడు అజిత్‌ పవార్‌ బీజేపీ గూటికి చేరారు. దాంతో ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. దాదాపు మూడు రోజుల వ్యవధిలోనే బీజేపీకి రాంరాం అంటూ మళ్లీ శరద్‌ పవార్‌కు జై కొట్టారు. పవార్‌ మంత్రాంగంతో శివసేన–కాంగ్రెస్‌–ఎన్సీపీ కూటమి పురుడు పోసుకుంది. ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. రెండున్నరేళ్ల పాటు సాఫీగా సాగిన ప్రయాణంలో హఠాత్తుగా సంక్షోభం తలెత్తింది. చివరకు ఉద్ధవ్‌ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)