amp pages | Sakshi

జాతీయ స్థాయిలో పార్టీపై కేసీఆర్‌ క్లారిటీ

Published on Mon, 09/07/2020 - 19:47

సాక్షి, హైదరాబాద్‌ : జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న వస్తున్న వార్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పందించారు. కొత్త రాజకీయ పార్టీపై సోషల్ ‌మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని కొట్టిపారేశారు. జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటుపై భవిష్యత్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్సీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం సీఎం మాట్లాడారు. (10న రెవెన్యూ చట్టంపై ప్రకటన)

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఏ ఒక్కరూ ఆశామాషీగా తీసుకోవద్దని, ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని సభ్యులకు హితబోధ చేశారు. అన్ని అంశాలపై సభలో చర్చిద్దామన్నారు. పూర్తి సమాచారంతో అందరూ మాట్లాడాలని సూచించారు. రెవిన్యూ చట్టంతో రాష్ట్ర రూపురేఖలు మారతాయని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం సందర్భంగా దుబ్బాక దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సీఎం నివాళి అర్పించారు. ఆయన మృతితో దుబ్బాకలో ఉప ఎన్నికల అనివార్యమైన విషయం తెలిసిందే. పార్టీ అభ్యర్థి ఎంపికపై కొంత ఉత్కంఠ ఉన్నా.. సోలిపేట కుటుంబంలోనే ఒకరికి టికెట్‌ కేటాయించే అవకాశం ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

తెలంగాణ కేబినెట్ భేటీ 
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కీలకమైన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షత సమావేశమైన కేబినెట్‌ కొత్త రెవెన్యూ చట్టం, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సీఎం సభ్యులతో చర్చించనున్నారు.


 

Videos

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌