amp pages | Sakshi

'మా స్టాండ్‌ని వదిలిపెట్టం'! అందుకు మూల్యం చెల్లించేందుకు రెడీ!

Published on Tue, 05/23/2023 - 11:41

ఎన్సీపీకి చెందిన కొందరు నేతలపై ఈడీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ దీని గురించి విలేకరులతో మాట్లాడారు. ఎన్సీపీ సీనియర్‌ నేత జయంత్‌ పాటిల్‌ని ఎన్‌ఫోర్ట్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీని గురించి పవార్‌ని మీడియా ప్రశ్నించగా..కొందరూ నాయకులు పాలక వ్యవస్థ అంచనాలను అందుకోవడానికి నిరాకరించడంతో ఈ చర్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఐతే వారు కష్టపడతారేమో కాని వారు ఎంచుకున్న మార్గం నుంచి మాత్రం ఎప్పటికీ తప్పుకోరని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్సీపీకి చెందిన సుమారు తొమ్మిది నుంచి పదిమంది నాయకుల విషయంలో కొంత అంచనాలను కలిగి ఉన్నారనే దాన్ని కొట్టిపారేయలేం అన్నారు. తాము ఆ అంచనాలను అందుకోవడానికి సిద్ధంగా లేమని, మా స్టాండ్‌ కోసం మూల్యం చెల్లించేందుకు కూడా సిద్ధమేనని కరాఖండీగా చెప్పారు. అలాగే తాము ఎంచుకున్న మార్గాన్ని ఎన్నటికీ వదిలిపెట్టమని తేల్చి చెప్పారు.

ఎన్సీపీ ‍స్టాండ్‌ని చూసి కొందరూ(బీజేపీని ఉద్దేశించి) జీర్ణించుకోలేకపోవడంతోనే తాము బాధపడాల్సి వస్తుందని, ఐనా దాని గురించి తాము చింతించటం లేదని అన్నారు. తన వద్ధ విచారణ ఎదుర్కొన్న కీలకమైన 10 మంది నాయకుల జాబితా కూడా ఉందన్నారు. వారిలో కొందరు ఏజెన్సీ చర్యలను కూడా ఎదుర్కొన్నారు. అందుకు ఉదహరణగా మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ గురించి చెప్పుకొచ్చారు పవార్‌.

ఒక విద్యాస​ంస్థ కోసం దేశ్‌ముఖ​్‌ దాదాపు రూ.100 కోట్లు స్వీకరించారని ఆరోపణలు ఎదర్కొన్నారు. అందుకోసం సుమారు 13 నుంచి 14 నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది కూడా. ఆ తర్వాత వచ్చిన మొత్తం రూ.100 కోట్లు కాదని రూ. 1.50 కోట్లని తేలింది. అప్పటికే దేశ్‌ముఖ్‌ పరువు పోయింది" ఆరోపణల స్థాయి ఇలా ఉంటుందంటూ అధికార దుర్వినయోగం గురించి పవార్‌ చెప్పుకొచ్చారు. 

(చదవండి: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా ఖాదర్‌)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)