amp pages | Sakshi

అయ్యో దేవుడా: పాప ప్రాణం కోసం తండ్రి ఆరాటం..

Published on Thu, 06/03/2021 - 14:35

లక్నో: ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ మంచం మీద నుంచి కింద‌ప‌డడంతో అత్య‌వ‌స‌ర చికిత్స కోసం త‌ల్లిదండ్రులు ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించగా వైద్యం చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. వైద్యులు చేయకున్నా తన బంగారాన్ని కాపాడుకునేందుకు ఆ తండ్రే తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఎలాగైనా బతికించుకోవాలని కూతురికి నోటిలో నోరు పెట్టి శ్వాస అందించేందుకు ప్రయత్నించాడు. కానీ చివరకు ఆ చిన్నారి ప్రాణాలు దక్కలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. పాప ప్రాణం నిలిపేందుకు ఆ తండ్రి పడుతున్న కష్టాలు చూస్తుంటే కళ్లు చెమరుస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్త‌రప్రదేశ్ బారాబంకి జిల్లాకు చెందిన గౌస్‌పూర్‌కు చెందిన ఓ తండ్రి తన కూతురు మంచం పైనుంచి కిందపడిందని ఐదేళ్ల చిన్నారిని ఆస్పత్రికి తీసుకొచ్చాడు. బరాబంకిలోని ఆస్పత్రి వైద్యులు చికిత్స చేసేందుకు వెనకడుగు వేశారు. దీంతో కొన ప్రాణంతో ఉన్న తన కూతురిని బతికించేందుకు ఆ తండ్రి నోటితో శ్వాస అందించాడు. పలుమార్లు నోటితో పాప నోట్లో ఊది బతికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అనంతరం ఊపిరితిత్తులను పలుమార్లు మెల్లగా నొక్కాడు. అయినా అతడి ప్రయత్నాలు ఫలించలేదు. పాప కన్నుమూసింది. వైద్యుల తీరుపై ఆ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతోపాటు ఈ సన్నివేశాన్ని సెల్‌ఫోన్‌లలో వీడియోలు తీయడంపై మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాల కోసం ఈ వార్త చదవండి: నా కూతురు చ‌నిపోయింది సార్‌, మీకు డ్రామాలా ఉందా? 
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)