amp pages | Sakshi

గుండెతో స‌హా అమ్మ‌కానికి '‌అమ్మ' అవ‌య‌వాలు

Published on Tue, 09/22/2020 - 19:31

కొచ్చి: త‌ల్లి త‌న బిడ్డ‌ల‌ను న‌వ‌మాసాలు క‌డుపులో మోస్తుంది. ఈ లోకంలోకి అడుగు పెట్టాక వారి పెరుగుద‌ల కోసం జీవితాన్నే త్యాగం చేస్తుంది. పిల్ల‌ల క‌న్నా త‌న‌కేదీ ముఖ్యం కాద‌నుకున్న ఓ త‌ల్లి గుండెతో స‌హా త‌న అవ‌య‌వాల‌ను అమ్మ‌కానికి పెట్టింది. అంద‌రినీ కంట‌త‌డి పెట్టిస్తోన్న ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని కొచ్చిలో జ‌రిగింది. క‌టిక దారిద్య్రాన్ని అనుభ‌విస్తున్న ఆ పేద మ‌హిళ పేరు శాంతి. ఆమెకు ఐదుగురు పిల్ల‌లు. కాయ‌క‌ష్టం చేసి పైసలు సంపాదిస్తున్న‌ ఆమె పెద్ద కొడుకు గ‌తేడాది రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర ‌గాయాల‌పాల‌య్యాడు. దీంతో అత‌నికి బ్రెయిన్ స‌ర్జ‌రీ చేశారు. రెండో కొడుకు పుట్టుక‌తోనే మాన‌సిక రుగ్మ‌త‌తో బాధ‌ప‌డుతున్నాడు. (కూతురి బర్త్‌డే: ఆ తండ్రి కోరిక ఇదే!)

చేయి చాచి అడిగినా సాయం చేయ‌లేదు
ప‌ద‌కొండేళ్ల కూతురు కూడా రోడ్డు ప్ర‌మాదంతో న‌రాల వ్యాధి బారిన ప‌డింది. వీరంద‌రినీ పోషించేందుకు కుటుంబ బాధ్య‌త‌ను భుజాన వేసుకున్న‌ మూడో కొడుకును లాక్‌డౌన్ వెక్కిరించ‌డంతో ఉపాధి కోల్పోయాడు. ఆఖ‌రు బిడ్డ‌ ఇంకా స్కూలు విద్య‌న‌భ్య‌సిస్తోంది. ఇల్లు గ‌డ‌వ‌డ‌మే కష్టంగా ఉన్న ఆ కుటుంబానికి పిల్ల‌ల మందులకు మ‌రింత ఇబ్బంది కాసాగింది. దీంతో ఆ త‌ల్లి సిగ్గు చంపుకుని చేయి చాచి సాయం కోరితే పైసా ఇవ్వ‌డానికి కూడా ఎవ‌రూ ముందుకు రాలేదు. దీంతో ఈసారి ఆమె ఎవ‌రి సాయం కోర‌లేదు. త‌న అవ‌యవాల‌ను అమ్మి అయినా స‌రే పిల్ల‌ల చికిత్స‌కు ఏ లోటూ రాకూడ‌ద‌ని, ఉన్న అప్పులు తీరిపోవాల‌ని నిర్ణ‌యించుకుంది. ఓ బోర్డును ఏర్పాటు చేసి, దానిపై త‌న గుండెతో స‌హా అన్ని అవ‌య‌వాల‌ను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని పేర్కొంది. ఆమె బ్ల‌డ్‌గ్రూప్ వివ‌రాల‌ను కూడా పొందుప‌రిచింది.

స్పందించిన ప్ర‌భుత్వం
ఈ విష‌యం గురించి శాంతి మాట్లాడుతూ.. "నేను గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు భ‌ర్త వ‌దిలేశాడు. త‌ర్వాత‌ డ్రైవింగ్ టీచ‌ర్‌గా ప‌ని చేశాను. కానీ అప్పుడే కూతురి ఆరోగ్యం పాడ‌వ‌డంతో ఆమెను చూసుకునేందుకు ఆ ప‌నిని వ‌దిలేయ‌క త‌ప్ప‌లేదు. చాలా రోజులుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారిపోతున్నాయి. అద్దె కూడా చెల్లించ‌లేని నిస్స‌హాయ స్థితికి చేరుకున్నాం. నా ముగ్గురు పిల్ల‌ల‌కు తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లున్నాయి. అందుకే నా అవ‌యవాల‌ను అమ్మి వారిని బాగు చేసేందుకు సిద్ధ‌మ‌య్యాను" అని వాపోయింది. ఇక ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం స్పందించింది. ఆమెను తాత్కాలిక నివాసానికి త‌ర‌లించింది. ఆమె పిల్ల‌లకు అవ‌స‌ర‌మ‌య్యే చికిత్స‌ను, మందుల బిల్లుల‌ను కూడా ప్ర‌భుత్వ‌మే భ‌ర్తిస్తుంద‌ని కేర‌ళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైల‌జ హామీ ఇచ్చారు. (ఆన్‌లైన్‌ క్లాసుల్లో పరిస్థితి ఇలానే ఉంటుందేమో?)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌