amp pages | Sakshi

ఒక్క సినిమాకే భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన ‘సీత’? అవాక్కవుతున్న నిర్మాతలు!

Published on Fri, 08/26/2022 - 17:18

మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌, మరాఠి భామ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ‘సీతారామం’ భారీ విజయం అందుకుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్నా కీ రోల్‌ పోషించిన ఈ మూవీ ఇప్పటికీ సందడి చేస్తోంది. ఇండియన్‌ ఆర్మీ, ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇందులో సీతామహాలక్ష్మిగా మృణాల్‌ పాత్ర బాగా ఆకట్టుకుంది. తన నటనకు, అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మంచి డిమాండ్‌ పెరిగినట్లు తెలుస్తోంది.

చదవండి: అందుకే మాకు ఈ కఠిన పరిస్థితులు..: సునీల్‌ శెట్టి

ప్రస్తుతం ఆమెకు ఇక్కడ వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట. వైజయంతి బ్యానర్లో సీతారామం చేసిన ఆమె ఇదే బ్యానర్లో మరో సినిమాకు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. వైజయంతి బ్యానర్లో స్వప్న సినిమా పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులో ఇప్పటికే మృణాల్‌ను ఖరారు చేశారని, ఆమె ఈ ప్రాజెక్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చిందట. ఇక తెలుగులో ఆమెకు డిమాండ్‌ పెరగడంతో మృణాల్‌ భారీగా రెమ్యునరేషన్‌ పెంచిందనే టాక్‌ వినిపిస్తోంది. పెద్ద ప్రొడక్షన్‌ అయిన వైజయంతి బ్యానర్లోనే ఆమె రెండు సినిమాలు చేస్తుండటంతో ఆమెను వరుసగా దర్శక-నిర్మాతలు సంప్రదిస్తున్నారట.

చదవండి: బాలీవుడ్‌ స్టార్లను అమ్ముకుంటుంది: అనుపమ్ ఖేర్‌ సంచలన వ్యాఖ్యలు

దీంతో మృణాల్‌ కోటీ రూపాయల రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తోందని సమాచారం. దీంతో తొలి సినిమా అనంతరమే ఈ రెంజ్‌లో డిమాండ్‌ చేయడం ఏంటని దర్శక-నిర్మాతలు అవాక్కవుతున్నారట. కాగా మృణాల్‌ తొలుత టీవీ సీరియల్స్‌ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరాఠిలో పలు టీవీ సీరియల్స్‌లో నటించిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్‌ చిన్ని చిన్న సినిమాలు చేస్తూ వెండితెరపై నటిగా ఎదిగింది. ఈ క్రమంలో ఆమె హిందీ జెర్సీలో హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది. ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ మృణాల్‌ పాత్ర మాత్రం మంచి ఆదరణ లభించింది. దీంతో తెలుగులో సీతారామం మూవీ ఆఫర్‌ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ తెలుగు సినిమా, హిందీలో 3, 4 పెద్ద సినిమాలతో పాటు రెండు డిజిటల్‌లో ఓ రెండు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌