amp pages | Sakshi

‘రుద్రమదేవి’ బాలనటి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

Published on Sun, 07/24/2022 - 10:12

వెబ్‌ సిరీస్‌లలో ట్రెండింగ్‌లో ఉన్న సిరీస్‌.. తెలుగు ఆంథాలజీ ‘మోడర్న్‌ లవ్‌ హైదరాబాద్‌’. అందులో నటించిన మహామహులు సుహాసిని, రేవతి.. నేటి స్టార్స్‌ నిత్యామీనన్, రీతూ వర్మలతో పాటుగా వినిపిస్తున్న పేరు ఉల్కా గగన్‌ గుప్తా. ఈ సిరీస్‌ కన్నా ముందే తెలుగు తెరకు ఆమె పరిచయం.. ‘ఆంధ్రాపోరి’ సినిమాతో. ఇంకొన్ని వివరాలు ఈ ‘కాలమ్‌’లో.. 

ఉల్కా పుట్టింది, పెరిగింది ముంబైలో. తల్లిదండ్రులు.. మంజు గుప్తా, గగన్‌ గుప్తా. తండ్రి కూడా నటుడే. నిజానికి ఉల్కా ఐఏఎస్‌ ఆఫీసర్‌ కాలనుకుంది. కానీ సినిమా రంగంతో సంబంధమున్న వాతావరణంలో పుట్టి, పెరగడంతో ఆమె ఆసక్తి, అభిరుచి నటనవైపు మళ్లింది. తన ఎనిమిదవ ఏట.. ‘రేషమ్‌ డంఖ్‌’ అనే టీవీ సిరియల్‌తో యాక్టింగ్‌ ఫీల్డ్‌లోకి వచ్చింది. ‘రాణి లక్ష్మీబాయి’ సీరియల్‌లో చిన్నప్పటి లక్ష్మీబాయిగా నటించి దేశమంతా పాపులర్‌ అయింది. ఆ పాత్ర కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, సంస్కృతం నేర్చుకుంది. ఆ సీరియల్‌ తర్వాత క్షణం తీరికివ్వనన్ని అవకాశాలు ఆమె ఇంటి ముందు క్యూ కట్టాయి. వాటిలో ఒకటి తెలుగులో వచ్చిన రుద్రమదేవి సినిమా కూడా. అందులో చిన్నప్పటి రుద్రమదేవిగా మెప్పించింది. ఓ వైపు చదువుకుంటూనే ఇంకో వైపు యాక్టింగ్‌ కెరీర్‌ కొనసాగించింది.

హీరోయిన్‌గా వెండి తెరకు పరిచయం అయింది తెలుగు చిత్రం ‘ఆంధ్రాపోరి’తోనే. ఆ తర్వాతనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ‘ట్రాఫిక్‌’ అనే సినిమాతో. అటు సినిమాలు.. ఇటు టెలివిజన్‌ ప్రేక్షకులనే కాదు ఇప్పుడు వెబ్‌ స్క్రీన్‌ వీక్షకులనూ అలరిస్తోంది ఉల్కా. నటనంటే ప్రాణం. అందుకే ఏ పాత్రయినా సరే.. మనసుపెట్టి నటిస్తానంటోంది ఉల్కా.

చదవండి: ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బులిచ్చా.. సమంత షాకింగ్‌ కామెంట్స్‌
ఆ గ్యాప్‌లో నన్ను నేను తెలుసుకున్నాను

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌