amp pages | Sakshi

Laal Singh Chaddha: నాగ చైతన్యకు షాకింగ్‌ రెమ్యునరేషన్‌, అన్ని కోట్లా?

Published on Wed, 08/10/2022 - 16:54

జయపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అక్కినేని హీరో నాగచైనత్య.  తొలి సినిమా జోష్‌తోనే ప్రయోగం చేశాడు. ఆ తర్వాత వరుసగా లవ్‌ స్టోరీలు.. కొన్ని మాస్‌ కమర్షియల్‌ సినిమాలు చేస్తూ.. ఏ ఒక్క జోనర్‌కి పరిమితం కాకుండా ఆల్‌ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన సినిమాల్లో కొన్ని బాక్సాపీస్‌ వద్ద నిరాశపరిచినప్పటికీ.. అభిమానుల్లో మాత్రం ఆయనకున్న క్రేజ్‌ మాత్రం చెక్కు చెదరలేదు.

ఇక ఈ ఏడాది బంగా​ర్రాజు, థ్యాంక్యూ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన చైతూ.. తొలిసారి ‘లాల్‌సింగ్‌ చడ్డా’తో బాలీవుడ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించాడు.  అయితే ఈ సినిమాలో నటించడానికి నాగ చైతన్య తీసుకున్న రెమ్యునరేషన్‌ బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

(చదవండి:  సమంతను కలిస్తే ఏం చేస్తారు? నాగ చైతన్య షాకింగ్‌ ఆన్సర్‌)

ప్రస్తుతం నాగచైనత్య ఒక్కో సినిమాకు 8 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నాడట. అయితే ‘లాల్‌ సింగ్‌ చడ్డా’లో చై స్పెషల్‌ రోల్‌ మాత్రమే చేస్తున్నాడు. ఇందుకు గాను నిర్మాతు అతనికి రూ.5 కోట్లు రెమ్యునరేషన్‌గా ఇచ్చారట. మరి ఈ చిత్రంతో చైతన్య పాన్‌ ఇండియా స్థాయిలో క్లిక్‌ అవుతాడో లేదో చూడాలి. ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ  రీమేక్‌గా వస్తున్న ‘లాల్‌సింగ్‌ చడ్డా’ ఆగస్ట్‌11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్‌ చిరంజీవి సమర్పిస్తున్నాడు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)