మహేశ్‌ బాబు అన్నదాంట్లో తప్పేముంది? సపోర్ట్‌గా నిలిచిన కంగనా

Published on Fri, 05/13/2022 - 13:27

Kangana Ranaut on Mahesh Babu Comments: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఇటీవలె బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. బాలీవుడ్‌ తనను భరించలేదన్న మహేశ్‌ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా వీటిపై బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ స్పందించింది. తను నటించిన ‘ధాకడ్' మూవీ ట్రైలర్‌ రిలీజ్‌లో భాగంగా కంగనా మాట్లాడుతూ..

'అవును మహేశ్‌ బాబు అన్నది నిజమే.ఆయన్ను బాలీవుడ్‌ భరించలేదు. ఎందుకంటే బాలీవుడ్‌ నుంచి ఎంతోమంది ఆయనతో సినిమా కోసం సంప్రదించారో నాకు తెలుసు. ప్రస్తుతం టాలీవుడ్‌ దేశంలోనే నెం1 ఇండస్ట్రీగా ఉంది. కాబట్టి ఆయనకి తగిన రెమ్యునరేషన్‌ని బాలీవుడ్‌ ఇవ్వలేదు.

అయినా మహేశ్‌ చేసిన కామెంట్స్‌ని ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారో అర్థం కావట్లేదు. టాలీవుడ్‌పై, తన పనిపైనా మహేశ్‌బాబు గౌరవం చూపడం వల్లే ఆయన ఈ స్థాయిలో ఉండగలిగారు. దాన్ని మనందరం అంగీకరించాలి' అని పేర్కొంది. అంతేకాకుండా టాలీవుడ్‌ను చూసి చాలా నేర్చుకోవాలంటూ చెప్పుకొచ్చింది. చదవండి: అందుకే నాకింకా పెళ్లి కావట్లేదు : కంగనా రనౌత్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ