amp pages | Sakshi

ఆ‘గాలి’ అమ్ముకొని వారానికి రూ. 53 లక్షలు సంపాదిస్తోంది..

Published on Wed, 12/15/2021 - 19:05

తమ అభిమాన తారలకు సంబంధించిన అలవాట్లు, అభిరుచులు, వస్తువులు.. ఇలా వేటినైనా తెగ ఇష్టపడుతుంటారు డై హార్డ్‌ ఫ్యాన్స్‌. వారు వాడే యాక్సెసరీల నుంచి ఆటోగ్రాఫ్ చేసిన పేపర్‌ వరకు ఏది దొరికినా వాటిని మధుర జ్జాపకంగా పదిలంగా దాచుకుంటారు. ఇప్పటి వరకు స్టార్స్‌ తమ వాచ్‌లు, షర్ట్స్‌, బైక్‌లు వంటి వస్తువలను వేలంలో అమ్మి డబ్బులు సంపాదించిన ఘటనలు ఎన్నో చూశాం కానీ ఓ టీవీ స్టార్‌ తన అపాన వాయువును (పిత్తు) అమ్మి లక్షల్లో ఆదాయం గడిస్తుందంటే నమ్ముతారా.. నిజమేనండి. బహిరంగంగా మాట్లేందుకు ఇబ్బందిగా ఫీల్‌ అయ్యే అపానవాయువుతో డబ్బులు కూడా సంపాదిస్తున్నానని స్టెఫానీ మాటో అనే టీవీ ఆర్టిస్ట్‌ చెప్పడం వైరల్‌గా మారింది.

90డే ఫియాన్స్‌ అనే టీవీ షో ద్వారా స్టెఫానీ మట్లో సోషల్‌ మీడియాలో తెగ పాపులారిటీని సంపాదించింది. అయితే తనకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరగడంతో తన అపానవాయువును అమ్మే బిజినెస్‌ను ప్రారంభించింది. ఆ వాయువును అమ్ముతూ వారానికి ఏకంగా 70 వేల డాలర్లు అంటే ఇండియన్‌ కరెన్సీలో సుమారు 53 లక్షల రూపాయలను ఆమె సంపాదిస్తోంది. ఈ విషయాన్ని స్టెఫానీ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. 
చదవండి: హృదయ విదారకం.. చనిపోయిన తల్లి ఫోటోతో వధువు కన్నీళ్లు

తన అపానవాయువును ఓ గాజు పాత్రలో వేసి ఒక్కో యూనిట్‌ను 1,400 డాలర్లకు (సుమారు లక్ష) తన అభిమానులకు ఆన్‌లైన్‌లో అమ్ముకుంటుంది. దీనికి సంబంధించిన వీడియోలను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేస్తూ అపానవాయువును అమ్మడం ద్వారా డబ్బు ఎలా సంపాదిస్తుందో పేర్కొంది. అలాగే అపానవాయువు బయటకు రావడం కోసం తాను ఎలాంటి ఫుడ్‌ తీసుకుంటుందో వివరించింది. వీడియోలో బీన్స్, ప్రోటీన్ మఫిన్, గట్టిగా ఉడికించిన గుడ్లు, ప్రోటీన్ షేక్, పెరుగు చూపిస్తుంది. 

ఇంతకూ గబ్బు లేపే అపానవాయువును కొనేదెవరు? ఈ సోది ఏంటి అనేగా మీ సందేహం. రెండు రోజుల్లోనే ఆమె 90 జార్లు అమ్మేసిందంటే... వాటికి ఎంత డిమాండ్ ఉందో ఆలోచించండి. తను అపానవాయువు పంపే గాజు పాత్రలో పూల రేకులు పెట్టడంతో అది సువాసన భరితంగా ఉంటుందని ఆమె తెలిపింది. వీటికి తోడు ఓ నోట్‌ కూడా రాసి పంపుతోంది. ఇంకేముంది అభిమాన తార నుంచి అపురూప కానుక అంటూ ఫ్యాన్స్‌ వేలకు వేలు పోసి కొనుక్కుంటున్నారు.
చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..

బజ్‌ఫీడ్‌ అనే మీడియా కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టెఫానీ మాట్లాడుతూ.. ‘అపానవాయువు అమ్ముకోవడం నాకు తగిన పని అని అనిపించింది. అంతేగాక కొంచెం ఫన్నీగా, డిఫరెంట్‌గా ఫీల్‌ అయ్యాను. ఇది కొత్త ఉపాధి కూడా’ అని ఆమె పేర్కొంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)