amp pages | Sakshi

విలేకరుల సమావేశం జరపవద్దు!... అంటూ సాలీడు ఎలా అడ్డుపడుతుందో చూడండి!!

Published on Sun, 12/19/2021 - 08:04

Spider Interupts Australia News Conference: ఒక్కోసారి ప్రజానాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడూ అది కూడా మీడియా ప్రత్యక్ష ప్రశారాల్లో అనుకోని అంతరాయాలు ఏర్పడటం చూస్తుంటాం. సిగ్నల్స్‌ లేక  లేదా ఒక వేళ అక్కడ ఉన్న వ్యక్తులు సమావేశం జరగకుండా అడ్డుతగలడమే చూస్తుంటాం. కొంత మంది వ్యక్తులైతే పనిగట్టుకుని ఉపన్యాసిస్తున్న నేతను పట్టుకుని అందరి ముందు దులిసేసి రసభాస చేయడం కూడా ఇటీవలకాలంలో మనం ఎక్కువగా చూశాం. కానీ ఒక సీరియస్‌ మీటింగ్‌లో అది కూడా ఒక ఆరోగ్య మంత్రి సమావేశంలో ఒక చిన్న సరీసృపం ఎలా అంతరాయం కలిగించిందో తెలుసా!. పైగా ఒక్క నిమిషంపాటు ఆ మంత్రి కూడా కంగారుపడి పోవడం కూడా జరిగింది.

(చదవండి: పాండా జూ నుంచి తప్పించుకోవాలని యత్నించి.. పాపం ఎలా టెంప్ట్‌ అయ్యిందో చూడండి!!

అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్ ఆరోగ్య మంత్రి యివెట్ డి అథ్వాస్ కోవిడ్‌ -19 మహమ్మారి నియంత్రణలు, వ్యాక్సిన్‌లకు సంబంధించి బహిరంగ మీడియా సమావేశం నిర్వహించారు. అలాగే ఆ సమావేశంలో వ్యాక్సినేషన్‌ విధివిధానాలకు అనుగుణమైన వ్యాపార ఆవశ్యక్యత గురించి  ప్రసంగిస్తున్నారు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఒక సాలీడు ఆమె మాట్లాడుతుండగా ఆమె మీద నుంచి సమీపంలోని పోడియం పై పడుతుంది.

దీంతో ఏదో మీద పడినట్టుగా భావించి ఒక్కసారిగా కంగారుపడుతుంది. ఆ తర్వాత వెంటనే మీలో ఎవరైన దీన్ని ఇక్కడ నుంచి తీసేయగలరా అంటూ ఆమె ప్రశ్నించారు. ఇంతలో చీఫ్ హెల్త్ ఆఫీసర్ జాన్ గెరార్డ్ కొన్ని కాగితాలను ఉపయోగించి సాలీడును తీసేశాడు. అయితే ఆమె మన వద్ద కోవిడ్‌ ఉంది, స్పైడర్‌లు ఉన్నాయంటూ చమత్కరించారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి: ఫిలిప్పీన్స్‌లో టైఫూన్‌ తుపాను బీభత్సం.. 21 మంది మృతి)

Videos

Play Offs లోకి ఆర్సిబీ

ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి

మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు

పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు

టీడీపీపై బొత్స సెటైర్లు

వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు

సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..

కేబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..

Photos

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)