amp pages | Sakshi

వివాహేతర సంబంధం: భార్య తల నరికిన భర్త.. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి..

Published on Tue, 02/08/2022 - 21:15

టెహ్రాన్: ఇరాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో ఆమె తల నరికి చంపాడో భర్త. అంతేగాక నరికిన తలతో భర్త వీధుల్లోకి రావడం తీవ్ర కలకలం రేపింది. గత శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఇరాన్‌లోని అహ్వాజ్‌లో ఓ వ్యక్తి తన భార్య(17) మోనా హీదారీతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లైన కొన్నాళ్లపాటు వీరి వివాహ బంధం సజావుగానే సాగింది. 

అయితే భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త గ్రహించాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య కలహాలు తలెత్తాయి. భర్తకు విషయం తెలియడంతో మహిళ దేశం విడిచి టర్కీకి పారిపోయింది. అయినప్పటికీ వివాహితను వెతికి పట్టుకున్న తండ్రి, ఆమె భర్త తిరిగి ఇరాన్‌కు తీసుకువచ్చారు. అయితే భార్య ఇంటి నుంచి పారిపోవడంతో తన పరువు పోయిందని భావించిన భర్త.. తమ్ముడితో కలిసి మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు.
చదవండి: అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం.. పోలీసుల అదుపులో మహిళ, విటుడు

అంతటితో ఆగకుండా ఓ చేతిలో కత్తి, మరో చేతిలో భార్య తల పట్టుకొని రోడ్డు మీదకు నవ్వుతూ వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులైన భర్తతోపాటు అతని సోదరుడిని సోమవారం అరెస్ట్‌ చేశారు. అయితే వారి పేర్లను పోలీసులు బయటపెట్టలేదు. మరోవైపు ఈ ఊదంతంపై ఇరాన్‌ దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన ఇరాన్‌ దేశ ప్రజలందరూ షాక్‌కు గురయ్యారని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా ద్వారా డిమాండ్‌ చేస్తున్నారు.

దీనిపై స్పందించిన మహిళా వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ ఎన్సీ ఖాజాలీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ దేశ  పార్లమెంట్‌ను కోరింది. కాగా ఇరాన్‌లో బాలికల వివాహ వయసు 13 ఏళ్లుగా నిర్ణయించారు. అంతేగాక బాధితురాలికి పెళ్లి అయినప్పుడు ఆమె వయసు 12 ఏళ్లు కావడం గమనార్హం.

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌