amp pages | Sakshi

పబ్జీ ఆడొద్దన్నందుకు కుటుంబాన్నే కాల్చేశాడు..!

Published on Fri, 01/28/2022 - 20:10

ఇస్లామాబాద్​: సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్​లైన్ క్లాసులు వినడానికి మొబైల్​ ఫోన్​లు కొనిస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు వీటిని ఆటల కోసం, అశ్లీల వీడియోలు చూస్తూ ఫోన్​ను దుర్వినియోగం చేస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు పబ్జీ ఆటలకు, ఇతరవాటికి బానిసలుగా మారి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. పబ్జీ గేమ్​కు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు బానిసలుగా మారిన విషయం మనకు తెలిసిందే.

పబ్జీ ఆటకు బానిసలుగా మారి కొందరు తమ విచక్షణను కోల్పోతున్నారు. దీని కోసం..  కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు ఆడొద్దని వారించిన వారిని చంపిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి పాకిస్తాన్​లో పంజాబ్​ ప్రావిన్స్​లో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..  నహిద్​ ముబారక్​ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కహ్నా ప్రాంతంలో ఉండేవాడు.

ఈ క్రమంలో అతనికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా,  14 ఏళ్ల అతని కుమారుడు కొన్ని రోజులుగా చదువుపై శ్రద్ధపెట్టడంలేదని అతని తల్లి వారించింది. అతను పబ్జీ ఆటను మానేయాలని హెచ్చరించింది. దీంతో విచక్షణ కోల్పోయిన బాలుడు.. తన తల్లితో సహా ఇద్దరు మైనర్​ సోదరీమణులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు.

ఆ తర్వాత సదరు బాలుడు.. ఇంటి బయటకు వచ్చి అలారం  శబ్ధం చేశాడు. తన కుటుంబాన్ని ఎవరో చంపారని తెలిపాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కాగా, నహిద్​ తన కుటుంబ రక్షణ కోసం లైసెన్స్​డ్​ రివాల్వర్​ను తన ఇంట్లో పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల తర్వాత నిందితుడు గన్​ను ఎక్కడ పారేశాడో తెలియలేదు.  

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. కాగా, పాక్​ పత్రిక డాన్​ ప్రకారం.. ఆన్​లైన్​ పబ్జీ గేమ్​   సంబంధించి ఇది నాల్గవ నేరమని తెలిపింది. కాగా, డబ్ల్యూహెచ్​వో ఇప్పటికే  గేమింగ్​ డిజార్డర్​ను ఒక వ్యాధిగా గుర్తించింది. వీరు ఈ ఆటకు బానిసలుగా మారి తమ విచక్షణను కోల్పోయి విపరీతంగా ప్రవర్తిస్తారని తెలిపింది. 

చదవండి: బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి సంకల్పం: అఖిలేష్ యాదవ్

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)