amp pages | Sakshi

డ్రగ్స​ దందాలో సరికొత్త పంథా...వినియోగిస్తూ.. విక్రయిస్తూ..

Published on Mon, 03/28/2022 - 08:07

సాక్షి హైదరాబాద్‌: నగరానికి చెందిన సయ్యద్‌ ఆసిఫ్‌ జిబ్రాన్, పి.తరుణ్‌ కొన్నేళ్ల క్రితం డ్రగ్స్‌కు అలవాటుపడ్డారు. కాలక్రమంలో వినియోగించడంతో పాటు అందుకు అవసరమైన డబ్బు కోసం విక్రయించడమూ ప్రారంభించారు.

  • గౌలిగూడ వాసి అశుతోష్‌ కొన్నేళ్లుగా మియాపూర్‌కు చెందిన లక్కీ నుంచి గంజాయి, హష్‌ ఆయిల్‌ ఖరీదు చేసి వినియోగిస్తున్నాడు. ఆపై స్నేహితులు, పరిచయస్తులకు వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు. 
  • వీరితో పాటు వీరి నుంచి డ్రగ్స్‌ ఖరీదు చేసి వినియోగిస్తున్న వారినీ గత గురు–శుక్రవారాల్లో హెదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారులు పట్టుకున్నారు. కేవలం వీళ్లే కాదు.. కొన్నాళ్లుగా వెలుగులోకి వస్తున్న ఉదంతాలను పరిశీలిస్తే... సరదా కోసం డ్రగ్స్‌ వాడటం మొదలెట్టిన వారిలో 95 శాతం మంది వాటికి బానిసలుగా మారుతున్నారని, ఇలాంటి వినియోగదారుల్లో 40 శాతం విక్రేతల అవతారం ఎత్తుతున్నారని పోలీసులు గుర్తించారు.  

నిఘాతో పాటు పెరుగుతున్న రేటు... 
రాజధానికి గంజాయితో పాటు దాని సంబంధిత పదార్థమైన హష్‌ ఆయిల్‌ విశాఖ, అదిలాబాద్‌ ఏజెన్సీల నుంచి వచ్చి చేరుతోంది. హెరాయిన్, కొకైన్, ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌ వంటి మాదకద్రవ్యాలు గోవాతో పాటు ఇతర మెట్రోల నుంచి వచ్చేవి. అయితే పోలీసులు, ఎక్సైజ్‌ అధికారుల నిఘా పెరగడంతో మాకద్రవ్యాల దందా డార్క్‌ నెట్‌ ద్వారా జరుగుతోంది. వీటి క్రయవిక్రయాలపై నిçఘా ఏస్థాయిలో ఉంటే... వాటి రేట్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ కారణంగానే వీటికి బానిసలుగా మారిన యువత ఆ ‘ఖర్చు’ల కోసం విక్రేతలుగా మారుతున్నారు. కాస్త ఎక్కువ మొత్తంలో వాటిని తెప్పించి స్నేహితులు, పరిచయస్తులకు విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువైందని హెచ్‌–న్యూ అధికారులు చెప్తున్నారు.  

వారి కంటే వీరికే ఎక్కువ శిక్షలు... 
డ్రగ్స్, గంజాయి సంబంధిత కేసులను ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ కింద నమోదు చేస్తారు. న్యాయస్థానిల్లో నిందితులు దోషులుగా నిరూపితమైనప్పుడు ఇందులోని సెక్షన్ల ప్రకారమే శిక్షలు పడతాయి. ఈ చట్ట ప్రకారం వినియోగదారుల కంటే విక్రేతలకు ఎక్కువ శిక్షలు ఉంటాయి. ఏ నిందితుడు వినియోగదారుడు? ఎవరు విక్రేత అనేది అరెస్టు సమయంలో వారి వద్ద లభించిన డ్రగ్, గంజాయి పరిమాణంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి నిర్థారిస్తారు. ప్రొఫెషనల్‌ డ్రగ్‌ పెడ్లర్లు కాకపోయినా... ఖర్చుల కోసం ఈ దందా చేసినా అదే స్థాయిలో శిక్ష అనుభవించాల్సి వస్తుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలైన వాళ్లే పెడ్లర్లుగా మారుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవన్నీ డ్రగ్స్‌ బానిసల లక్షణాలు:  
నగరంలోని డ్రగ్స్‌ వినియోగదారులు, విక్రేతల్లో అనేక మందిని హెచ్‌–న్యూ పట్టుకుంది. వీరిని పరిశీలించడంతో పాటు విచారించిన నేపథ్యంలో అనేక సారూప్యతలు ఉన్న లక్షణాలను గుర్తించింది. ఇవి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలని, వీటిలో ఏవైనా వారి పిల్లల్లో కనిపిస్తే అప్రమత్తం కావాలని సూచించింది.  

  • మాదకద్రవ్యాలతో పాటు గంజాయి, హష్‌ ఆయిల్‌ వంటి వాటికి బానిసలుగా మారిన యువతలో అనేక మంది తమ ఒంటిపై టాటూస్‌ ఎక్కు వ సంఖ్యలో వేయించుకుంటున్నారు. వీటిలోనూ పుర్రెలు, కొన్ని రకాలైన పూలు ఉంటున్నాయి.  
  • డ్రగ్స్‌ వినియోగదారులు వినే సంగీతం కూడా అసాధారణంగా ఉంటోంది. సైకొడెలిక్‌గా పిలిచే చిత్రమైన మ్యూజిక్‌ను వింటుంటారు. టెక్నో, ట్రాన్స్‌ మ్యూజిక్స్‌గా పిలిచే వీటిలో లిరిక్స్‌ కంటే మ్యూజిక్కే ఎక్కువగా ఉంటుంది. ఇది వింటూ మత్తులో జోగుతుంటారు. 
  • వీరిని ఎదైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పే విధానం సుదీర్ఘంగా ఉంటుంది. చిత్రమైన డిజైన్లతో కూడిన దుస్తులు ధరించడం, విభిన్నమైన హెయిల్‌ స్టైల్స్‌ కలిగి ఉండటం కూడా బానిసల లక్షణాలు. వీళ్లు ఎక్కువగా టీషర్టులు, చిత్రమైన షర్టులు ధరిస్తూ ఉంటారు.  
  • డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వాళ్లు సాధారణంగా ఒక్కరుగా వాటిని తీసుకోరు. ఎక్కువగా గ్రూప్‌ పార్టీలు నిర్వహిస్తూ, వాటికి హాజరవుతూ ఉంటారు. తరచుగా గోవాకు వెళ్లివస్తున్న యువత విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని హెచ్‌–న్యూ అధికారులు సూచిస్తున్నారు. 

(చదవండి: కారు కొనివ్వలేదని యాసిడ్‌ తాగాడు.. )

Videos

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)