amp pages | Sakshi

గత 2 నెలలుగా బాలికను వినోద్​జైన్ లైంగికంగా​ వేధించాడు: ఏసీపీ

Published on Sun, 01/30/2022 - 14:56

సాక్షి, విజయవాడ: విజయవాడ విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో కలకలంగా మారిన విషయం తెలిసిందే. బెంజి సర్కిల్‌ వద్ద గల ఒక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక నిన్న(శనివారం) ఆత్మహత్యకు పాల్పడింది. కాగా,  టీడీపీ నేత వినోద్‌ జైన్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక సూసైడ్​ నోట్​లో పేర్కొందని స్థానిక ఏసీపీ హనుమంతరావు తెలిపారు.

బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ 306 సెక్షన్​ల కింద కేసులను నమోదు చేసినట్టు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. లైంగిక వేధింపుల వల్లే బాలిక చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. నిందితుడిని, అతని కుటుంబ సభ్యుల్ని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టామని పేర్కొన్నారు.

పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని సెక్షన్​ల కింద కేసులను నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా వినోద్​ జైన్​ ఇంటిని ఇప్పటికే సీజ్​ చేసినట్లు ఏసీపీ తెలిపారు. గత 2 నెలలుగా బాలికను.. వినోద్​జైన్ లైంగికంగా​ వేధించాడని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఈ క్రమంలో బాలిక ఎవరికీ చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవించిందని అన్నారు.

నిందితుడు వినోద్​జైన్.. ఎలాంటి ఇబ్బందులకు గురిచేసేవాడో బాలిక సూసైడ్​ నోట్​లో రాసిందని ఏసీపీ తెలిపారు.  బాలిక.. లిఫ్ట్​లో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బాలికను వేధించేవాడని సూసైడ్​ నోట్​లో రాసింది. కాగా, రెండు పేజీల్లో బాలిక తన బాధను తెలియజేసిందని ఏసీపీ హనుమంతరావు తెలిపారు.  నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు. 

చదవండి: బాలిక ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది: వాసిరెడ్డి పద్మ

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)