amp pages | Sakshi

శాంసంగ్‌కు భారీ షాక్‌.. 30రోజుల గడువిచ్చిన కోర్టు.. మాట వినకపోతే..

Published on Fri, 07/29/2022 - 15:27

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీ శామ్‌సంగ్‌కు ఆస్ట్రేలియా ఫెడరల్‌ కోర్టు ఝలకిచ్చింది. స్మార్ట్‌ ఫోన్లుకు సంబంధించి తప్పుదోవ ప్రకటనలు ఇచ్చినందుకు కోర్టు శామ్‌సంగ్‌కు 14 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం రూ.78 కోట్లు) ఫైన్‌ విధించింది. ఈ మొత్తాన్ని కూడా 30 రోజుల్లోగా చెల్లించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జస్టిస్ బ్రెండన్ ముర్ఫీ తీర్పునిచ్చారు.

అంతేకాకుండా ఈ వ్యవహారంపై విచారణ జరిపినందుకుగాను ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్‌కి కూడా అదనంగా మరో 2 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు ( భారత కరెన్సీ ప్రకారం రూ.1.10 కోట్లు) చెల్లించాలని ఆదేశించారు. 2016 నుంచి 2018 మధ్య S7, S7 ఎడ్జ్.A5 (2017), A7 (2017), S8, S8 ప్లస్, నోట్ 8 గెలెక్సీ ఫోన్లను శామ్‌సంగ్‌ ఆస్ట్రేలియాలో విక్రయించింది. ప్రత్యేకంగా వీటిని తయారు చేశామని నీళ్లలో తడిచినా పాడవవంటూ భారీగా ప్రకటనలు కూడా ఇచ్చింది.

నీళ్లలో ఈ ఫోన్లు ఉంచినప్పుడు ఛార్జింగ్ పోర్టులు పాడయ్యాయి. దీంతో తమ ఫోన్లు పనిచేయడం లేదంటూ వందలాదిగా వినియోగదారులు ఆస్ట్రేలియన్ కాంపీటీషన్ అండ్ కన్జూమర్ కమిషన్ కి  ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి 2019లో నమోదైన కేసులపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంపై శాంసంగ్‌ స్పందిస్తూ.. 2016 నుంచి 2017 మధ్యలో అమ్మకాలు జరిపిన ఏడు మోడళ్లపై మాత్రమే ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది. ప్రస్తుత శాంసంగ్‌ ఫోన్‌లలో ఈ తరహా సమస్యలు లేవని తెలిపింది.

చదవండి: Gmail Storage: మీ ఇ-మెయిల్ బాక్స్ నిండిపోయిందా, సింగిల్‌ క్లిక్‌తో ఇలా చేయండి!

Videos

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)