amp pages | Sakshi

కేంద్రం సంచలన నిర్ణయం..! ఆ కార్ల తయారీ నిలిపివేత?

Published on Tue, 12/20/2022 - 19:07

త్వరలో కేంద్రం రియల్ డ్రైవింగ్ ఎమిషన్‌ (ఆర్‌డీఈ) నిబంధనల్ని అమలు చేయనుంది?. దీంతో భారత్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి కొన్ని కంపెనీలకు చెందిన కార్లు, ఎస్‌యూవీలు కనుమరుగు కానున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

కొత్త ఉద్గార నిబంధనలు డ్రైవింగ్‌ సమయంలో కార్ల నుంచి విడుదలయ్యే ఎన్‌ఓఎక్స్‌ వంటి కాలుష్య కారకాల్ని కొలవడం, వేగం వృద్ధి, క్షీణతలో తరచూగా వచ్చే మార్పులను పరిణగలోకి తీసుకోనున్నాయి.  ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, కార్ల తయారీదారులు తమ ఇంజిన్‌లను తక్కువ ఉద్గారాలకు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. ఇంజన్ అప్‌డేషన్ ప్రక్రియ ఖరీదైంది. కాబట్టే దేశీయ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో పలు కంపెనీల  27 డీజిల్‌ కార్లు, ఎస్‌యూవీల కార్యకలాపాల్ని నిలివేసే అవకాశం ఉంది.  

ఆర్‌డీఈ నిబంధనల ప్రకారం వాహనాలు డ్రైవింగ్ సమయంలో విడుదలయ్యే ఉద్గార స్థాయిలను గుర్తించేలా  పరికరాన్ని కలిగి ఉండాలి. ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉత్ప్రేరక కన్వర్టర్లు, ఆక్సిజన్ సెన్సార్‌ల వంటి క్లిష్టమైన భాగాలను పరికరం పర్యవేక్షిస్తుంది. కార్‌మేకర్‌లు క్రాంక్‌షాఫ్ట్ పొజిషన్‌లు, థొరెటల్, ఇంజన్ ఉష్ణోగ్రతను స్కాన్ చేయడానికి వాహనాల సెమీకండక్టర్‌లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. కార్లు, ఎస్‌యూవీలలో ఇంధనం మండే స్థాయిని నియంత్రించడానికి ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్లను కూడా అమర్చాలి.

అన్ని డీజిల్ ఇంజిన్‌లు ఉద్గారాల నియంత్రణ ఖరీదైన 'సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్' (ఎస్‌ఈఆర్‌) సాంకేతికతకు మారవలసి ఉంటుంది. కాబట్టి, డీజిల్ కార్ల ధర గణనీయంగా పెరుగుతుంది.  కార్ల తయారీకి భారీగా ఖర్చు చేయడం, తయారీ ఖర్చు.. కార్ల ధరల్ని పెంచడం.. పెరిగిన ధరలతో వాటి డిమాండ్‌ పడిపోవడం వంటి పరిణామలత నేపథ్యంలో సంస్థలు కార్ల తయారీని, అమ్మకాల్ని నిలివేయనున్నాయి. 

వాటిలో హోండా  సిటీ 4వ జెన్, సిటీ 5వ జెన్ (డీజిల్), అమేజ్ (డీజిల్), జాజ్ డబ్ల్యూఆర్‌ -వీ, మరాజు, అల్ట్రాస్‌ జీ4, కేయూవీ 100, మహీంద్రా, హ్యుందాయ్,  స్కోడా ఒక్కొక్కటి రెండు మోడళ్లను నిలిపివేయనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ ఐ20, వెర్నా డీజిల్ మోడళ్లను ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేస్తే, స్కోడా ఆక్టావియా, సూపర్బ్‌ కార్లు మార్కెట్‌లో కనుమరుగు కానున్నాయి. టాటా ఆల్ట్రోజ్ (డీజిల్), రెనాల్ట్ క్విడ్ 800, నిస్సాన్ కిక్స్, మారుతి సుజుకి ఆల్టో 800 నిలిపివేయనున్న జాబితాలో ఉన్నాయి. 

చదవండి👉 టోల్‌ప్లాజా, ఫాస్టాగ్‌ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!

Videos

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌