amp pages | Sakshi

నేటి నుంచి బెక్టర్స్‌ ఫుడ్‌.. పబ్లిక్‌ ఇష్యూ

Published on Tue, 12/15/2020 - 10:39

ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్‌ ఫుడ్‌ స్పెషాలిటీస్‌ పబ్లిక్‌ ఇష్యూ నేడు(15న) ప్రారంభమైంది. 17న(గురువారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 286-288కాగా.. తద్వారా రూ. 540 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా సోమవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 162 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 288 ధరలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, ఫ్రాంక్లిన్‌ ఇండియా స్మాలర్‌, ఎస్‌బీఐ డెట్‌ హైబ్రిడ్‌ తదితర 7 ఎంఎఫ్‌లకు షేర్లను కేటాయించింది. ఐపీవోలో భాగంగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలు వాటాలను విక్రయించనున్నాయి. ఐపీవో నిధులను విస్తరణ వ్యయాలు, తదితర సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. రాజ్‌పురా యూనిట్‌లో బిస్కట్ల తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. (బర్గర్‌ కింగ్‌ ఐపీవో.. స్పందన సూపర్‌)

దిగ్గజ కస్టమర్లు
బర్గర్‌ కింగ్‌, మెక్‌డొనాల్డ్స్‌, కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌ తదితర గ్లోబల్‌ ఫాస్ట్‌ఫుడ్‌ చైన్స్‌(క్యూఎస్‌ఆర్‌)కు బెక్టర్‌ ఫుడ్స్‌ బన్స్‌ సరఫరా చేస్తోంది. బెక్టర్స్‌ క్రీమికా పేరుతో సొంతంగా ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్‌ ఒవెన్‌ బ్రాండుతో సొంత బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్‌ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్‌ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. (బర్గర్‌ కింగ్‌ లిస్టింగ్.. అ‘ధర’హో)

పోటీ ఎక్కువే..
లిస్టెడ్‌ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్‌, హార్వెస్ట్‌ గోల్డ్‌ కంపెనీలతో బెక్టర్స్‌ ఫుడ్‌ పోటీ పడుతోంది. గ్లోబల్‌ ఫాస్ట్‌ఫుడ్‌ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్‌ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్‌ డఫ్‌ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా ఉన్న బేకర్స్‌ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్‌ ఫుడ్‌ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్‌ మార్కెట్‌ విలువ 7 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్‌ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్‌, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)