amp pages | Sakshi

కొత్త రికార్డులతో మార్కెట్లు షురూ

Published on Thu, 12/03/2020 - 09:59

ముంబై, సాక్షి: కరోనా వైరస్‌ కట్టడికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ను యూకే ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌ వచ్చింది. దీంతో హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 137 పాయింట్లు పెరిగి 44,755కు చేరగా.. నిఫ్టీ 50 పాయింట్లు జమ చేసుకుని 13,163 వద్ద ట్రేడవుతోంది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 44,953వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. తద్వారా 45,000 పాయింట్ల మార్క్‌కు చేరువైంది. ఇక నిఫ్టీ 13,216ను అధిగమించడం ఇంట్రాడే గరిష్టం రికార్డును సాధించింది. ఈ ఏడాది క్యూ3లో దేశ ఆర్థిక వ్యవస్థ రికవర్‌కానున్న అంచనాలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

మీడియా, మెటల్స్‌ అప్
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2-1.2 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, గెయిల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హీరో మోటో, ఎస్‌బీఐ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఎస్‌బీఐ లైఫ్‌, ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్‌, యూపీఎల్‌, ఐటీసీ, టీసీఎస్‌, బజాజ్ ఆటో 1.3-0.4 శాతం మధ్య నీరసించాయి.

ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్స్‌లో టాటా కెమ్‌, జీ, ఐబీ హౌసింగ్‌, భారత్ ఫోర్జ్‌, కోఫోర్జ్‌, సెయిల్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, మదర్‌సన్ 4-2.6 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే అదానీ ఎంటర్‌, గోద్రెజ్‌ సీపీ, బాష్‌ 1 స్థాయిలో డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి.

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 357 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. అయితే డీఐఐలు రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)