amp pages | Sakshi

Gold Price: బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట!

Published on Thu, 06/17/2021 - 19:02

మీరు బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఒక్కరోజులో పుత్తడి ధర భారీగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగిరావడంతో ఆ ప్రభావం దేశీయ గోల్డ్ ధరల మీద కూడా పడింది. దీంతో బంగారం రేటు పడిపోయింది. అలాగే, బంగారం ధర బాటలోనే వెండి కూడా పయనించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 10 గ్రాముల 24 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై రూ.911లు తగ్గడంతో రూ.47,611కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ.48,529గా ముగిసింది. ఇక ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.841 తగ్గడంతో రూ.43,612కి చేరుకుంది. 

గతంలో ఇంత మొత్తం మేర తగ్గిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే, ఇక హైదరాబాద్‌లో కూడా గోల్డ్‌ ధర దిగొచ్చింది. నేడు (జూన్ 17) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 క్షిణించి రూ.49,470కు తగ్గింది. 22 క్యారెట్ల 122 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.500 క్షిణించి రూ.45,350కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో, 2023లో వడ్డీ రేటు పెంపు జరగవచ్చని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అధికారులు సూచించారు. దీంతో బుధవారం పుత్తడి ధర ఒకశాతం తగ్గింది. తాజాగా 2.31 శాతం ధర పడిపోవడంతో ఔన్స్‌ పసిడి ధర 1,821 డాలర్లు పలుకుతోంది. మరోవైపు, వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. కిలో వెండిపై రూ.1,311లు తగ్గడంతో 70,079గా ట్రేడ్‌ అవుతోంది.

చదవండి: స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు చేదువార్త!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)