amp pages | Sakshi

e-Shram: కార్మికులకు అండగా ఇ-శ్రమ్‌

Published on Wed, 08/25/2021 - 14:29

అసంఘటిత రంగంలో అనామకంగా ఉండిపోయిన కార్మికలకు అండగా నిలించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. సంక్షేమం, ఉపాధి, ప్రభుత్వ పథకాలు తదితర అంశాల్లో కార్మికులకు సహాయకారిగా ఉండేందుకు ఇ శ్రమ్‌ పేరుతో పోర్టల్‌ని ప్రారంభించనుంది.

ఎంతమంది కార్మికులు
భారత దేశంలో అసంఘటిత రంగంలో దాదాపు 38 కోట్ల మంది కార్మికులు ఉన్నట్టు అంచనా. కోవిడ్‌ సంక్షోభం సమయంలో లాక్‌డౌన్‌ విధించినప్పుడు వీరంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఊరుకాని ఊరిలో ఇటు యజమానులు, అటు ప్రభుత్వ మద్దుతు సరైన సమయంలో అందక ఇక్కట్ల పాలయ్యారు. దీంతో ఇటు పౌర సమాజం, అటు న్యాయస్థానాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అసంఘటిత కార్మికులు ఎంత మంది ఉన్నారు, సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే అంశంపై నిర్థిష్ట కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది.

ఇ-శ్రమ్‌
అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం లక్ష్యంగా కేంద్రం ఆగస్టు 26న ఇ శ్రమ్‌ వెబ్‌ పోర్టల్‌ని అందుబాటులోకి తేనుంది. ఆధార్‌కార్డు ఆధారంగా కార్మికులు తమ వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల అసంఘటిత రంగంలో ఎంత మంది కార్మికులు ఉన్నారు. వీరిలో నిర్మాణ రంగం, వలస కార్మికులు, వీధి వ్యాపారులు ఇలా కేటగిరిల వారీగా ఎంత మంది ఉన్నారనే సమాచారం ప్రభుత్వానికి అందుతుంది. అదే విధంగా ఆయా కేటగిరిల కింద ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకు అందించే వీలు కలగనుంది.

ఒకే గొడుకు కిందికి
ఇ శ్రమ్‌ పోర్టల్‌ అందుబాటులోకి రావడం వల్ల ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్మిక సంఘాలు కూడా ఒకే గొడుకు కిందకు వచ్చే అవకావం ఉంది. దీని వల్ల కార్మికుల సమస్యల వెలుగులోకి రావడంతో పాటు సమస్యల పరిష్కారం సైతం త్వరగా జరిగేందుకు వీలు ఏర్పడనుంది. ఆగస్టు 26న పోర్టల్‌ ప్రారంభించినప్పటి నుంచే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది.

కార్మికుల కోసం హెల్ప్‌లైన్‌
ఇ శ్రమ్‌ వెబ్‌ పోర్టల్‌తో పాటు అసంఘటిత కార్మికుల కోసం కార్మిక శాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయనుంది. అందులో భాగంగా 14434 నంబరును దేశవ్యాప్తంగా కార్మికులకు అందుబాటులోకి తేనుంది. 
 

చదవండి: JioMeet : ఆన్‌లైన్‌ క్లాసుల కోసం జియోమీట్‌.. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)