amp pages | Sakshi

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మరిన్ని నగరాల్లో...

Published on Thu, 02/17/2022 - 17:45

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం  బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మరిన్నీ నగరాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆసక్తి గల కస్టమర్లు తమ యూనిట్‌లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చునని పేర్కొంది.

మరిన్నీ నగరాల జోడింపు...
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వాహనాలను మరింత వేగంగా అమ్మేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా  2022లో చేతక్ నెట్‌వర్క్‌ను మరో  12 కొత్త నగరాలను కంపెనీ జోడించింది. కోయంబత్తూర్, మధురై, కొచ్చి, కోజికోడ్, హుబ్లీ, విశాఖపట్నం, నాసిక్, వసాయ్, సూరత్, ఢిల్లీ, ముంబై, మపుసాతో సహా నగరాల్లో బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ అందుబాటులో ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను బుక్ చేసిన వారికి  కంపెనీ ప్రస్తుతం నాలుగు నుంచి ఎనిమిది వారాల వెయిటింగ్ పీరియడ్‌తో ఆయా కస్టమర్లను అందించనుంది. 

దూకుడు పెంచిన బజాజ్..!
బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని  పెంచుకోవడానికి రూ. 300 కోట్లను పెట్టుబడి చేస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ... రాబోయే కొద్ది వారాల్లో చేతక్ నెట్‌వర్క్‌ను అధిక డిమాండ్‌కు అనుగుణంగా రెట్టింపు చేయాలనేది మా ప్రణాళికని ఆయన అన్నారు.    


బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బన్, ప్రీమియం వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇవి ఒకే 3.8kW మోటార్ నుంచి శక్తిని పొందుతాయి.  నాన్-రిమూవబుల్ 3kWh IP67 లిథియం-అయాన్ బ్యాటరీను కల్గి వుంది.  ఈ స్కూటర్ గరిష్టంగా 70kmph వేగంతో 95km పరిధి మేర ప్రయాణం చేస్తుంది.  ఇండిగో మెటాలిక్, వెలుట్టో రోస్సో, బ్రూక్లిన్ బ్లాక్, హాజెల్‌నట్ వంటి రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)