amp pages | Sakshi

మహీంద్రాపై కర్నాటక రైతు ప్రతీకారం.. వివాదంలో మరో మలుపు

Published on Sat, 01/29/2022 - 15:42

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహీంద్రా ఆటోమొబైల్స్‌, కర్నాటక రైతు కెంపెగౌడల మధ్య వివాదం మరో మలుపు తీసుకుంది. సేల్స్‌మన్‌ అనుచిత ప్రవర్తనతో అవమానికి గురైన రైతుకి ఏకంగా మహీంద్రా గ్రూపు సీఈవో నుంచి ఆహ్వానం అందింది.

డ్యామేజ్‌ కంట్రోల్‌
రైతును అవమానించిన ఘటనతో మహీంద్రా గ్రూపుపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. వెంటనే మహీంద్రా రైస్‌ గ్రూపుతో పాటు ఆ సంస్థ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఇది మా పాలసీ కాదంటూ స్పందించారు. ఈ చర్యకు బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయంటూ ప్రకటించారు.  ఐపన్పటికీ ఈ వివాదం సోషల్‌ మీడియాలో రగులుతూనే ఉంది. మహీంద్రాపై ట్రోల్స్‌ కొనసాగుతూనే ఉ‍న్నాయి.  దీంతో మరోసారి డ్యామేజ్‌ కంట్రోల్‌ చర్యలకు చేపట్టింది మహీంద్రా రైజ్‌.

వెల్‌కమ్‌ టూ మహీంద్రా
2022 జనవరి 21న కెంపెగౌడకి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తాజాగా ప్రకటించింది మహీంద్రా రైజ్‌. జరిగిన ఘటనపై తగు చర్యలు తీసుకున్నామని, సమస్య సమసిపోయిందని తెలిపింది. మహీంద్రా వాహనం కొనుగోలు చేయాలనుకున్నందుకు కెంపెగౌడకు కృతజ్ఞతలు తెలిపింది. వివాదం సమసిపోయినందున మహీంద్రా వాహనం కొనాలంటూ కెంపెగౌడని కోరుతూ ట్వీట్‌ చేసింది. దీన్ని రీట్వీట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. మహీంద్రా ఫ్యామిలీలో చేరాలంటూ కెంపెగౌడకి వెల్‌కమ్‌ చెప్పారు. అయితే ఇంతటి వివాదానికి కారణమైన సేల్స్‌మన్‌పై ఏ విధమైన చర్యలు తీసుకున్నారనే అంశాలను మహీంద్రా గ్రూపు స్పష్టంగా ప్రకటించలేదు. 

ఇదీ వివాదం
కెంపెగౌడ అనే రైతు కారు కొనేందుకు కర్నాటకలోనిన తుముకూరులో ఉన్న మహీంద్రా షోరూమ్‌కి వెళ్లగా.. నీకు కారు కొనే స్థోమత లేదంటూ సేల్స్‌మాన్‌ అవమానకరంగా ప్రవర్తించాడు. దీంతో గంట వ్యవధిలోనే రూ.10 లక్షలతో వచ్చిన సదరు రైతు ఇప్పటికిప్పుడు వాహానం డెలివరీ చేస్తారా? అంటూ సవాల్‌ విసిరాడు. డెలివరీ చేయలేమంటూ షోరూం సిబ్బంది చెప్పారు. మహీంద్రా వాహనం కొనాలని ఇక్కడకు వచ్చానని, కానీ తనకు జరిగిన అవమానంతో వేరే కంపెనీ వాహనం కొంటాను అంటూ వెళ్లిపోయాడు కెంపెగౌడ. ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

చదవండి: Mahindra Showroom: రైతు ప్రతీకారం అదిరింది.. సినిమాలోని ట్విస్ట్‌ మాదిరిగా ఉంది

Videos

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌