కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీఎం జగన్‌ను కలిసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
Published on Wed, 06/09/2021 - 18:37
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వార్షిక నివేదికను సీఎంకు సమర్పించారు. కోవిడ్–19 నివారణ చర్యల కోసం అధికార భాషా సంఘం తరపున రూ.5 లక్షలు విరాళాన్ని ఛైర్మన్, సభ్యులు మోదుగుల పాపిరెడ్డి, షేక్ మస్తాన్లు సీఎంకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు అధికార భాషా సంఘమే లేదన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక అధికార భాషా సంఘం ఛైర్మన్‌ను నియమించారన్నారు. అధికారిక కార్యకలాపాల్లో తెలుగుభాష అమలుపై పర్యవేక్షణ చేయమని సీఎం జగన్ ఆదేశించారన్నారు.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ‘డీఎస్సీ-2008’ అభ్యర్థులు
#
Tags