amp pages | Sakshi

ప్రభుత్వం రద్దు అప్రజాస్వామికం

Published on Tue, 11/06/2018 - 06:55

సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌అర్బన్‌): రాష్ట్రంలో కేసీఆర్‌ తొమ్మిది నెలల ముందు ప్రభుత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామికమని, ఎవరినీ సంప్రదించకుండా, మొక్కుబడిగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీనీ రద్దు చేశారని కేంద్ర మా జీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. సోమవారం నగరంలోని ప్రగతినగర్‌ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో బీజేపీ ఆధ్వర్యంలో జన సంఘటన సభను నిర్వహించారు. సభకు హాజరైన  బండారు దత్తాత్రేయ మాట్లా డుతూ తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేసి, పీసీసీ అధ్యక్షుడిని రెండుసార్లు ఓడించి న ఘనత యెండల లక్ష్మీనారాయణకు ఉందన్నారు. ఈసారి టీఆర్‌ఎస్‌ను నగర ప్రజలు చిత్తు గా ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలని, బీజేపీకి అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం నెలకొందని, కాషాయజెండా ఎగరడం ఖాయమన్నారు.

ముఖ్యంగా మహిళలు, యువకులు, ముస్లిం మహిళలు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. ట్రిపుల్‌ తలాక్‌ను బీజే పీ తీసుకువచ్చి ఇబ్బందులకు గురవుతున్న ముస్లిం మహిళలకు అండగా నిలిచిందన్నారు. అన్నివర్గాల సంక్షేమం కోసం మోదీ సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. మోదీది అభివృద్ధి మంత్రం అని, కేసీఆర్‌ది అవినీతి మంత్రం అని ఎద్దేవాచేశారు. కమీషన్లు, కలెక్షన్ల వల్లే రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగడంలేదన్నారు. కేంద్రం రెండు లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ.1,157 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు కేవలం 1500 ఇళ్లు మాత్రమే నిర్మించారన్నారు. 

మద్యం తెలంగాణగా మార్చారు.. 
బంగారు తెలంగాణ అని చెప్పి మద్యం తెలంగాణగా మార్చారని దత్తాత్రేయ ఆరోపించారు. ఆదా యం కోసం అనేక కుటుంబాల జీవితాలను నాశనం చేస్తున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే మద్యపానాన్ని అరికడతామని హామీనిచ్చారు. ఎంతోమంది పేదలకు ఉపయోగపడే ఆయూష్మాన్‌ భారత్‌ను అడ్డుకుంటున్న ఘనత టీఆర్‌ఎస్‌ది అని విమర్శించారు. పీపీపీ పద్ధతిలో నిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులు, రైతులకు న్యాయం చేస్తామన్నారు. దోపిడీ లేని తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని, యెండల లక్ష్మీనారాయణను గెలిపిస్తే ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.

 టీఆర్‌ఎస్‌ 100 సీట్లు విజయం సాధిస్తుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారని, కానీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణుల్లో నిరుత్సాహం ఆవరించి ఉందన్నారు. మద్యం, డబ్బుతో వాతావరణాన్ని అనుకూలంగా మల్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తుందని, కానీ రోజురోజుకూ టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. మహాకూటమి సీట్ల సర్దుబాటుతో సతమతమవుతోందని, కాంగ్రెస్, టీడీపీ అవకాశవాద రాజకీయాలకు తెరలేపాయని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకమైన శక్తిగా ఎన్టీఆర్‌ నిలబడ్డారని, ఈ పొత్తుతో ఆయన ఆత్మ క్షోభిస్తోందని ఆరోపిం చారు. తన అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుందని, కాంగ్రెస్‌ మెహర్బానీపై టీడీపీ ఆధారపడి ఉందన్నారు. 

దీపావళి తర్వాత ప్రధాని మోదీతో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆ తర్వాత అమిత్‌ షా సభ కూడా ఉంటుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై 9వ తేదీ తర్వాత ఛార్జీషీటు విడుదల చేస్తామని, అనంతరం బీజేపీ మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు. జిల్లాలో నిజామాబాద్‌ అర్బన్, రూరల్, ఆర్మూర్‌లో బీజేపీ గెలుపు ఖాయంగా కన్పిస్తోందన్నారు. బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని, ఆ పార్టీ కార్యాలయంపై దాడి జరగడం దురదృష్టకరమన్నారు. దీనిపై ఆరా తీస్తున్నామని, భంగపడ్డ నేతలను సముదాయించి బుజ్జగిస్తామని తెలిపారు. ఈ ముక్కోణపు పోటీలో రాష్ట్రంలో 119 సీట్లలో పోటీ చేస్తున్న బీజేపీ లబ్ధి పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. రాబోయే కురుక్షేత్రంలో కార్యకర్తలు సైనికుల్లా పని చేసి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. 

నిజామాబాద్‌ అర్బన్‌ బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నగరంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి పనులు.. వాటి వైఫల్యాలను వివరించారు. గుంతలమయమైన నగర రోడ్లు.. వాటి వల్ల నాలుగేళ్లలో ప్రజలు ఎదుర్కొ న్న ఇబ్బందులు, కార్పొరేషన్‌లో గాడి తప్పిన పాలనను క్షుణ్ణంగా తెలియజేశారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్‌ ఓ పోలీస్‌ అధికారిపై దాడి, కమీషన్ల కోసం మున్సిపల్‌ ఎంఈని బలి చేయడం, తదితర సంఘటనలను టీఆర్‌ఎస్‌ పాలనకు నిదర్శమని ఉదహరించారు. నాసిరకమైన బతుకమ్మ చీరలు, డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీ ఇవ్వకుండా వారిని అగౌరపర్చారని విమర్శించా రు. ముఖ్యంగా సొంతింటి కలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాన్ని ఎండగట్టారు. తనను గెలిపిస్తే ఐదేళ్లలో నగరంలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని, యెండల లక్ష్మీనారాయణ మాటపై నిలబడే వ్యక్తి అని పేర్కొన్నారు. గతంలో తన పాలనను టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనతో బేరీజు చేసుకుని ప్రజలు తిరిగి తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

యెండలకు ఘన స్వాగతం.. 
నిజామాబాద్‌ అర్బన్‌ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన యెండల లక్ష్మీనారాయణకు బీజేపీ జిల్లా, నగర నాయకులు బోర్గాం(పి) చౌరస్తాలో ఘన స్వాగ తం పలికారు. అనంతరం అక్కడి నుంచి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు మాధవనగర్‌ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. ర్యాలీ బోర్గాం(పి) చౌరస్తా నుంచి ఫులాంగ్, ఆర్‌ఆర్‌ చౌరస్తా, పెద్దబజార్, గాంధీచౌక్, నాందేవ్‌వాడ, సుభాష్‌నగర్, ఎన్టీఆర్‌ చౌర స్తా మీదుగా ప్రగతినగర్‌ మున్నూరుకాపు కళ్యాణ మండపానికి చేరుకుంది. సమావేశంలో దత్తాత్రేయ సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు.   బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యులు టక్కర్‌ హన్మంత్‌రెడ్డి, నాయకులు బాల్‌రాజ్, యెండల సుధాకర్, జాలిగం గో పాల్, బాజిరెడ్డి రమాకాంత్, మల్లేష్‌ యాదవ్, న్యాలం రాజు, సుగుణ, స్వామి యాదవ్, తారక్‌ వేణు, రోషన్‌లాల్, మచల్‌ శ్రీనివాస్, ఆయా జోన్ల అధ్యక్షులు, మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్లే..  
సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌అర్బన్‌): టీఆర్‌ఎస్‌ కు ఓటేస్తే మజ్లిస్‌కు ఓటేసినట్లేనని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. సోమవారం నిజామాబాద్‌ నగరంలో నిర్వ హించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో కుటుంబ పార్టీ నాలుగేళ్ల పాటు కుటుంబ పాలనను సాగించిందని ఆరోపించారు. డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎంపీలు ఏ పత్రికలో, ఏ చానెళ్లల్లో కన్పిం చలేదని ఎద్దేవాచేశారు. నలుగురే ప్రభుత్వాన్ని నడిపించారని పేర్కొన్నారు. 

అదేవిధంగా టీడీ పీ, కాంగ్రెస్, మజ్లిస్‌ పార్టీలు కూడా కుటుంబ పార్టీలు అని అన్నారు. కేంద్రం సొమ్ముతో రాష్ట్రం సోకులు చేస్తుందని, ఈ పార్టీకి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మారుస్తామని చెప్పి మద్యం తెలంగాణగా మార్చారన్నారు. 2013–14లో మద్యం ద్వారా రాష్ట్ర ఆదాయం రూ.350 కోట్లు ఉండగా, ఈయేడాది రూ.20 వేల కోట్లు పెరిగిందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే మద్యపానాన్ని అరికడుతోందన్నారు. మహాకూటమిని దుష్టులు, ద్రోహుల కూటమని అభివర్ణించారు.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)