More

‘గులాబీ కాకతీయ’కే వ్యతిరేకం:కిషన్‌రెడ్డి

20 Apr, 2015 01:16 IST
‘గులాబీ కాకతీయ’కే వ్యతిరేకం:కిషన్‌రెడ్డి

మిషన్ కాకతీయలో ప్రతిపక్షాలను భాగస్వామ్యం చేయాలి
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పేరుతో చేపట్టిన చెరువుల పునరుద్ధరణకు తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వ సొమ్ముతో గులాబీమయం చేయడానికే వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారమిక్కడ పార్టీ కార్యాలయంలో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ, మిషన్ కాకతీయలో గడ్డపార, పార, తట్ట, కండువాలే కాకుండా చేతులు కడుక్కునే జగ్గు, చేతులు తుడుచుకునే రుమాలు కూడా గులాబీ రంగున్నవే వాడుతున్నారని ఎద్దేవా చేశారు.

పార్టీ కార్యక్రమంలాగా మిషన్ కాకతీయ చేపడితే ప్రతిపక్ష పార్టీల నేతలు ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. పనులు పూర్తయ్యేదాకా ప్రతిపక్షాలను, నిపుణులైన రిటైర్డు ఇంజనీర్లను భాగస్వామ్యం చేస్తే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుందని కిషన్‌రెడ్డి సూ చించారు. రెండురోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించడం తప్ప ఆచరణాత్మక నిర్ణయాలేమీ తీసుకోలేదని విమర్శించారు.

ఈ సందర్భంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి కిషన్‌రెడ్డి వారికి స్వాగతం పలికారు. ‘మా’కు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సినీనటుడు, పార్టీ నేత, శివాజీరాజాను కిషన్‌రెడ్డి అభినందించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

రేవంత్‌రెడ్డికి అసలు పరీక్ష.. బలమెంత? బలహీనతలేంటి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్‌డేట్స్‌

చేసేదే చెబుతాం!

పిట్ట బతుకే ఓటరుదీ... పిట్టమెదడే వాడి యుక్తి!

స్టార్‌ వార్‌