amp pages | Sakshi

చహల్‌కు రితిక దిమ్మ తిరిగే రిప్లై

Published on Sun, 09/22/2019 - 14:46

న్యూఢిల్లీ:  భారత క్రికెటర్లు రోహిత్‌ శర్మ-యజ్వేంద్ర చహల్‌ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దాంతో రోహిత్‌ కుటుంబంతో కూడా చహల్‌ బాగా చనువుగా ఉంటాడు. తాజాగా చహల్‌కు రోహిత​ శర్మ భార్య రితిక దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో భాగంగా బెంగళూరులో ఉన్న రోహిత్‌ శర్మను కలిసిన రితిక.. ఒక  సెల్ఫీ దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి ‘రీయునైటెడ్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు రితిక. అయితే తాను ఎందుకు ఫొటోలో లేనంటూ రితికను ప్రశ్నించాడు చహల్‌. ‘ నన్ను ఎందుకు కట్‌ చేశారు’ అంటూ చహల్‌ సరదాగా ట్వీట్‌ చేశాడు.

దానికి రితిక కూడా ఏమీ తగ్గలేదు. చహల్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ‘ నువ్వు ప్రస్తుతం భారత్‌ జట్టులో లేవు కదా. అందుకే నిన్ను కట్‌ చేశా’ అంటూ రితిక సమాధానం ఇచ్చారు. ఇది సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. దీనిని నెటిజన్లు బాగా ట్రోల్‌ చేస్తున్నారు.  కాగా, గతంలో కూడా వీరి మధ్య ఇటువంటి కామెంట్ల చమత్కరింపే నడిచింది. ఒకనొక సందర్భంలో ‘రోహిత్‌ నిన్ను బాగా మిస్‌ అవుతున్నా’ అని చహల్‌ ట్వీట్‌ చేయగా, ‘ ఇప్పుడు రోహిత్‌ నా మనిషి’ అంటూ సమాధానం ఇచ్చారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌