amp pages | Sakshi

‘అప్పుడు సుశాంత్‌కు ఎన్నో గాయాలయ్యాయి’

Published on Tue, 06/16/2020 - 18:34

ముంబై: పని పట్ల సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకుందని టీమిండియా మాజీ ఆటగాడు, సెలక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కిరణ్‌ మోరె అన్నారు. ధోని బయోపిక్‌ కోసం సుశాంత్‌ తన వద్ద 9 నెలల కఠోర సాధన చేశాడని తెలిపారు. ధోని తరహా ఆటతీరు కనబర్చే ప్రయత్నంలో అతను ఎన్నో గాయాలపాలయ్యాడని చెప్పారు. ఆక్రమంలోనే పక్కటెముకల గాయంతో 10 రోజులపాటు కోచింగ్‌కు దూరమయ్యాడని మోరె గుర్తు చేసుకున్నారు. కఠోర సాధనతో కష్టసాధ్యమైన కీపింగ్ నేర్చుకున్నాడని, ఫాస్ట్‌ బౌలర్లు, బౌలింగ్‌ మెషీన్‌ వేసే బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో అతని పోరాటపటిమకు తాను ముగ్ధుణ్ని అయ్యానన్నారు. 
(చదవండి: 'కావాల‌నే సుశాంత్‌ని 7 సినిమాల్లో త‌ప్పించారు')

‘నెట్స్‌లో సాధన చేసేటప్పుడు సుశాంత్‌తో మాటలకన్నా.. ఒకరకమైన తిట్లతోనే గడిచిపోయేది. అయినప్పటికీ అతను నాపై ఎప్పుడూ అసహనం వ్యక్తం చేయలేదు. ఆటపైనే దృష్టి పెట్టేవాడు. తెల్లవారు జామున, సాయంత్రం వేళల్లో, ఇటి దగ్గరా సుశాంత్‌ ప్రాక్టీస్‌ చేసి.. ఆ విశేషాలను నాతో పంచుకునేవాడు. మొత్తంమీద కోచింగ్‌ పూర్తయ్యేటప్పటికీ మా మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొంది. ధోని బయోపిక్‌కోసం అతని నిబద్థత చూసి.. ఆ సినిమా చక్కగా వస్తుందనుకున్నా. దాంతోపాటు సుశాంత్‌ కెరీర్‌లో ఇది అద్భుతమైన పాత్ర అవుందని,  నటుడిగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని భావించా.

ధోని తర్వాత హెలికాప్టర్‌ షాట్స్‌తో అదరగొట్టిన రెండో వ్యక్తి సుశాంతే. అదే విషయం తనదో చెప్పా. తను పొంగిపోయాడు. నెలన్నర కష్టపడి అతను హెలికాప్టర్‌ షాట్స్‌ ఆడటం నేర్చుకున్నాడు. అనంతరం అలవోకగా.. రోజూ 100 షాట్లు ఆడాడు. మూడు నాలుగు గంటల సెషన్లో 300 నుంచి 400 బంతుల్ని సుశాంత్‌ ఎదుర్కొనేవాడు. అలసటే లేకుండా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యేవాడు. తనను ఔట్‌ చెయ్యాలని నెట్‌ బౌలర్లకు చాలెంజ్‌ చేసేవాడు’అని కిరణ్‌‌ మోరె సుశాంత్‌తో సాగిన కోచింగ్‌ విశేషాలను నెమరేసుకున్నారు. కాగా, ముంబైలోని తన నివాసంలో సుశాంత్‌ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
(చదవండి: ఇక్కడ ఎవరూ ఎవరినీ పట్టించుకోరు: సైఫ్‌ అలీఖాన్‌)

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌