More

ఆటగాళ్ల ఫీజులు పెంచాలి: అనిల్‌ కుంబ్లే

22 May, 2017 10:49 IST
ఆటగాళ్ల ఫీజులు పెంచాలి: అనిల్‌ కుంబ్లే

హైదరాబాద్‌: భారత క్రికెట్‌ ప్రధాన కోచ్‌ అనిల్‌ కుంబ్లే, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లు ఆటగాళ్ల, టీం సపోర్టింగ్‌ స్టాఫ్‌ ల కాంట్రాక్టు ఫీజులు పెంచాలని బీసీసీఐ నిర్వాహకుల కమిటీని(సీఓఏ) కోరారు. ఆదివారం హైదరాబాద్‌ లో సీఈవో రాహుల్‌ జోహ్రి, జాయింట్‌ సెక్రటరీ అమితాబ్‌ చౌదరిలకు కోచ్‌ అనిల్‌ కుంబ్లే పీజులు 150 శాతం పెంచాలని కోరుతూ పూర్తి నివేదికను అందజేశారు. హైదరబాద్‌ లో కోహ్లీ లేకపోవడంతో స్కైప్‌ ద్వారా ప్యానెల్‌ మీటింగ్‌ చర్చలో పాల్గొన్నాడు. ఇప్టటికే గ్రేడ్‌ ఏ ఆటగాళ్లు రూ.2 కోట్లు, గ్రేడ్‌ బి ఆటగాళ్లు రూ. 1కోటి,  గ్రేడ్‌ సీ వారు రూ. 50 లక్షలు పొందుతున్నారు. అయితే కోహ్లీ, కుంబ్లే లు అన్నిఫార్మాట్లలో కలిపి గ్రేడ్‌ ఏ ఆటగాళ్లకు ఒక్కో సీజన్‌ కు రూ.5 కోట్లు చేయాలని ప్రతిపాదించారు.
 
అనిల్‌ కుంబ్లే, కోహ్లీ వేరువేరుగా ఆటగాళ్ల ఆర్ధిక పరిస్ధితులను సీఓఏకు వివరించారు. పుజార లాంటి టెస్టు బ్యాట్స్‌మన్‌ ఐపీఎల్‌ ఆడలేదిని, కేవలం రంజీలు ఆడే పవన్‌ నేగి ఐపీఎల్‌ లో 45 రోజుల్లో రూ.8.5 కోట్లు సంపాందించారని తెలిపారు. ఇక కుంబ్లే నివేదిక లో టీం ఇండియా సపోర్ట్‌ స్టాఫ్‌ ఫీజులు కూడా పెంచాలని పేర్కొన్నారు. ఈ ఛాంపియన్స్‌ ట్రోఫి అనంతరం కుంబ్లే కోచ్‌ కాంట్రాక్ట్‌ ముగియనుంది. అయితే ఛాంపియన్స్‌ ట్రోఫి అనంతరం జరిగే వెస్టిండీస్‌ టూర్‌ వరకు కోచ్‌ గా కుంబ్లే కొనసాగే అవకాశం ఉంది. ఆ మధ్య భారత స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ రంజీ ఆటగాళ్ల ఫీజులు పెంచాలని కోరుతూ భారత్‌ కోచ్‌ కుంబ్లేకు లేఖ రాశాడు.
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

జట్టుకు కోహ్లి.. విజయాలకు ధోని!

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం