More

నేనెందుకు స్పందించాలి : లోకేశ్‌

13 Sep, 2018 13:10 IST

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రసక్తే లేదని ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనే తమకు లేదన్నారు. గురువారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన లోకేశ్‌... కొత్త రాష్ట్రం(ఆంధ్రప్రదేశ్) ఏర్పడిన తర్వాత పూర్తికాలం అధికారంలో కొనసాగాలనేది తెలుగుదేశం పార్టీ సెంటిమెంట్‌ అని వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణలో ఇలా జరగకపోవడం విచారకరమని లోకేశ్‌ సానుభూతి వ్యక్తం చేశారు.

కాగా ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు జరగనున్నాయంటూ రిపబ్లిక్‌ టీవీలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అవన్నీ కేవలం ఊహాగానాలేని.. వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని లోకేశ్‌ అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

అందులో తప్పేముంది? మేం రోజుకు 15 గంటలు పనిచేస్తున్నాం: కాంగ్రెస్‌ ఎంపీ

TS: ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

పంజాబ్‌, తమిళనాడు గవర్నర్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

పురందేశ్వరి చంద్రముఖిలా మారిపోయారు: మంత్రి సీదిరి

బీజేపీలో ‘బీఫామ్‌’ మంటలు.. సంగారెడ్డిలో ఉద్రిక్తత