amp pages | Sakshi

‘కాంగ్రెస్‌లో ఎమర్జెన్సీ పోకడలు’

Published on Thu, 06/25/2020 - 10:35

సాక్షి, న్యూఢిల్లీ : ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ఈరోజుతో 45 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ ఇప్పటికీ ఎమర్జెన్సీ రోజుల తరహా మనస్తత్వానే కలిగిఉందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ప్రతినిధి సంజయ్‌ ఝా తొలగింపు వంటి ఘటనలు దీనికి సంకేతమని అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్‌ సభ్యులు, యువ సభ్యులు కొన్ని అంశాలు లేవనెత్తగా వారి గొంతు నొక్కారని, పార్టీ ప్రతినిధి ఒకరిపై అనవసరంగా వేటువేశారని కాంగ్రెస్‌ పార్టీలో నేతలు ఇమడలేకపోతున్నారని ధ్వజమెత్తారు.

విపక్ష పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ తనకు తాను కొన్ని ప్రశ్నలు వేసుకోవాలని అన్నారు. ఎమర్జెన్సీ తరహా మనస‍్తత్వం ఇంకా పార్టీలో ఎందుకు కొనసాగుతోందని, పార్టీలో ఇతర నేతలను ఎందుకు మాట్లాడనివ్వడం లేదని ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్‌ పార్టీలో నేతలు ఎందుకు ఇమడలేకపోతున్నారనేది తెలుసుకోవాలని సూచించారు. 45 ఏళ్ల కిందట దేశం ఇదే రోజున (జూన్‌ 25) ఓ కుటుంబం అధికార దాహంతో  రెండేళ్ల పాటు దేశం ఎమర్జెన్సీలోకి వెళ్లిందని రాత్రికి రాత్రే దేశం జైలుగా మారిందని పేదలు, అణగారిన వర్గాల వారిపై వేధింపులు సాగాయని అమిత్‌ షా గుర్తుచేశారు.

లక్షలాది ప్రజల ఆందోళనలతో ఎమర్జెన్సీని ఎత్తివేయడంతో భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని అన్నారు. కాంగ్రెస్‌లో మాత్రం ప్రజాస్వామ్యం లోపించిందని విమర్శించారు. పార్టీ, దేశ ప్రయోజనాల కంటే ఓ కుటుంబ ప్రయోజనాలే అధికమయ్యాయని ఇప్పటికీ కాంగ్రెస్‌లో పరిస్థితి అలాగే ఉండటం బాధాకరమని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.  

చదవండి : చైనా నిర్మాణం కంటే 10 రెట్లు పెద్దది!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌