amp pages | Sakshi

చర్చ్‌కు వెళ్తున్నారని.. సామాజిక బహిష్కరణ

Published on Sat, 08/04/2018 - 15:39

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో సామాజిక బహిష్కరణలు ఇప్పటీకి కొనసాగుతున్నాయి. చర్చికి వెళ్తున్నారంటూ 12 కుటుంబాలను సైనీ కమ్యూనిటికి చెందిన పెద్దలు కుల పంచాయతీ పెట్టి సామాజికంగా బహిష్కరించారు. ఈ ఘటన యూపీలోని మోరానాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. మోరానాబాద్‌కు చెందిన 12 సైనీ కుటుంబాలు ఇటీవల క్రీస్టియన్‌ మతంలోకి మారి, చర్చికి వెళ్తున్నారని సైనీ కుల పెద్దలు ఆరోపిస్తున్నారు. తమ కుల కట్టుబాట్లకు ఇది విరుద్దమని అందుకే వారిని  బహిష్కరించినట్లు కుల పెద్ద శివలాల్‌ సైనీ తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. గత నెల రోజులుగా వారు చర్చ్‌కి వెళ్తున్నారని, దీనిపై కులంలోని 300 మంది సభ్యులతో చిర్చించిన అనంతరం వారిని సామాజికంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ప్రతీ కుటుంబంపై ఐదువేల జరిమాన కూడా విధించినట్లు ఆయన తెలిపారు. బహిష్కరణకు గురైన కుటుంబంలో ఏలాంటి కార్యక్రమాలు జరిగిన ఎవరు హాజరు కావద్దని, వారితో ఎవరు కూడా మాట్లాడవద్దని కుల పంచాయతీ తీర్మానించినట్లు సైనీ వెల్లడించారు. షాపుల్లో ఏలాంటి సమాన్లు కూడా వారికి విక్రయించకూడదని గ్రామంలోని షాపులను హెచ్చరించారు.

తాము క్రీస్టియన్‌ మతంలోకి వెళ్లలేదని, కేవలం ప్రశాంతత కోసమే చర్చ్‌కి వెళ్తున్నామని బహిష్కరణకు గురైన కుటుంబ సభ్యులు తెలిపారు. కేవలం తప్పుడు సమాచారంతోనే తమ కుటుంబాలను సామాజిక బహిష్కరణకు గురిచేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభిస్తామని తెలిపారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)