amp pages | Sakshi

చైతూకి ‘వెంకీమామ’ బర్త్‌డే గిఫ్ట్‌ అదిరింది

Published on Sat, 11/23/2019 - 19:05

రియల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన హీరోలు వెంకటేశ్, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ ఈ చిత్రంలో కథానాయికలు. సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. చైతన్య పుట్టినరోజు సందర్భంగా(నవంబర్ 23)  అక్కినేని అభిమానుల కోసం ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. చైతూకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ‘అల్లుడు బర్త్‌డే గ్లింప్స్’ విడుదల చేశారు. 

‘నా మేనల్లుడి లవ్ స్టోరీ టైటానిక్ రేంజ్‌లో ఉంటుందనుకున్నాను.. కనీసం ఊళ్లో పడవ రేంజ్‌లో కూడా లేదురా’.. అని వెంకటేశ్‌ అంటే, ‘నేను మత్తులో ఉండి ఏం చెప్పానో, నువ్వు మందులో ఉండి ఏం విన్నావో.. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తా విను’ అంటూ చైతు చెప్పడంతో ఈ గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. ‘నా మేనల్లుడు సార్, వాడిక్కడే మిలటరీలో ఉన్నాడు సార్’ అని వెంకీ, ‘కెప్టెన్ కార్తీక్ శివరామ్.. వీరమాచినేని’ అని ప్రకాష్ రాజ్, ‘వాడు రోజూ దాటే గీత మనం ఒక్కసారి దాటితే ఎలా ఉంటుందో చూపించొస్తాను సార్’ అంటూ చైతన్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక చైతూ, రాశీఖన్నాలా కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. సరదా సన్నివేశాలు, సీరియస్‌ డైలాగ్స్‌తో సాగిన బర్త్‌డే గ్లింప్స్‌ అక్కినేని, దగ్గుపాటి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)