amp pages | Sakshi

కాలా దర్శకుడితో సూర్య?

Published on Sat, 06/16/2018 - 08:55

తమిళసినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన కాలా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. దీంతో రజనీకాంత్‌ తన తాజా చిత్రానికి రెడీ అయిపోయారు. కార్తీక్‌సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది కూడా.  కాలా చిత్ర దర్శకుడు పా.రంజిత్‌ నెక్ట్స్‌ చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. అట్టకత్తి చిత్రంలో మొదలైన ఈ దర్శకుడిగా పయనం ఈ దర్శకుడు మెడ్రాస్, కబాలి, కాలా వరకూ సక్సెస్‌ఫుల్‌గా సాగింది. దీంతో నెక్ట్స్‌ ఏంటీ అన్నదానికి పా.రంజిత్‌ ఇటీవల నటుడు శింబును కలిశారు. ఆయనతో చిత్రం చేయనున్నారా అనే ప్రచారం జరిగింది.  తాజాగా నటుడు సూర్య హీరోగా చిత్రం చేయనున్నారనే ప్రచారం సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది.

నిజానికి పా.రంజిత్‌ మెడ్రాస్‌ చిత్రం తరువాతే సూర్యతో చిత్రం చేయాల్సింది. అయితే రజనీకాంత్‌ను దర్శకత్వం చేసే అవకాశం రావడంతో ఆ ప్రపోజల్‌ ఆగింది. తాజాగా మళ్లీ సూర్య హీరోగా పా.రంజిత్‌ చిత్రం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరి కలయికలో చిత్రం వస్తే ఎలా ఉంటుందో ఊహించవచ్చు. సామాజిక అంశాలే పా.రంజిత్‌ కథా చిత్రాలుగా ఉంటాయనడానికి ఆయన గత చిత్రాలే సాక్ష్యం. అయితే ఈ కాంబినేషన్‌లో చిత్రం గురించి ఇంకా అధికారికపూర్వక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సూర్య ఎన్‌జీకే చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి కేవీ.ఆనంద్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఆ తరువాతే పా.రంజిత్‌ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)