amp pages | Sakshi

ఐకానిక్‌ సీన్‌ : ‘చైన్‌ లాగితే అయిపోయేది కదా..’

Published on Wed, 08/22/2018 - 16:23

ఇక్కడేమో సిమ్రన్‌ తండ్రి ఆమె చేతిని పట్టుకుని నిల్చున్నాడు.. అటు చూస్తే సిమ్రన్‌ తన జీవితంలోకి రాలేదనే బాధతో రాజ్‌ బేలగా చూస్తుంటాడు. పాపం సిమ్రన్‌ ఇటు తండ్రిని కాదనలేక.. అటు దూరమవుతున్న ప్రియున్ని దక్కించుకోలేక అసహాయంగా చూస్తుంటోంది.  ఇంతలో రైలు కదులుతుంది. అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో సిమ్రన్‌ తండ్రి కూతురుని చూస్తు ‘వెళ్లు సిమ్రన్‌ నువ్వు కోరుకున్న ప్రపంచంలోకి’ అంటూ కూతురి చేయిని వదిలేస్తాడు. అంతే దూరమవుతున్న ప్రియున్ని చేరుకోవడం కోసం సిమ్రన్‌ కదులుతున్న రైలుతో పాటే తాను పరిగెడుతుంది. రాజ్‌, సిమ్రన్‌ చేతిని అందుకుని రైలులోకి ఎక్కిస్తాడు. దాంతో కథ సుఖాంతం అవుతుంది. ఈ సన్నివేశం  23 ఏళ్ల క్రితం హిందీ సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసిన ఓ హిట్‌ చిత్రంలోనిది. ఇంతకు ఆ సినిమా ఏదో గుర్తుకొచ్చిందా.. అదే ‘దిల్‌ వాలే దుల్హానియే లే జాయేంగే’.

ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సిమ్రన్‌గా ‘కాజోల్’, ‘రాజ్‌’గా షారుక్‌ ఖాన్‌ జీవించారు. నాటి నుంచి కాజోల్ అబ్బాయిల ‘డ్రీమ్‌గర్ల్‌’గా, కింగ్‌ ఖాన్‌ షారుక్‌ అయితే ‘రొమాన్స్‌ కింగ్‌’గా నిలిచిపోయారు. ఈ చిత్రం విడుదలై నేటికి రెండు దశాబ్దాలు కావొస్తోన్నా ఇప్పటికీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. అయితే ఈ క్రెడిట్‌ అంతా దర్శకుడు ఆదిత్య చోప్రాకే దక్కుతుందంటున్నారు ‘సిమ్రన్‌’ కాజోల్‌. ఈ మధ్యే ఒక ‍ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా కాజల్‌ ‘దిల్‌వాలే దుల్హానియే లే జాయేంగే’ చిత్రం షూటింగ్‌ విశేషాలను గుర్తుచేసుకున్నారు.

కాజోల్ మాటల్లో.. ‘డీడీఎల్‌జే చిత్రంలో నేను పరిగెత్తుతూ రైలులోకి ఎక్కే ఆ సీన్‌ ఒక ఐకానిక్‌ సీన్‌గా నిలిచిపోయింది. ఈ సీన్‌ ఇప్పటికే చాలా సినిమాల్లో వాడారు కూడా. అంత క్రేజ్‌ వచ్చిన ఈ సీన్‌ షూట్‌ చేయడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సీన్‌ తీసే సమయంలో వాతావరణం చాలా వేడిగా ఉండటంతో చిరాకు వచ్చేది. నా జుట్టు గాలికి ఎగురుతూ వీర విహారం చేసేది. దానికి తోడు ఆ రైలు మేము అనుకున్న స్పీడ్‌లో కాకుండా మరింత వేగంగా వెళ్లేది. రీ షూట్‌ చేయాలంటే మళ్లీ ఆ రైలు వచ్చే వరకూ అంటే దాదాపు 20 నిమిషాల పాటు ఎదురు చూడాల్సిందే. ఆ సమయంలో రాజ్‌ నన్ను అలా పరిగెత్తించే బదులు చైన్‌ లాగి రైలు ఆపితే అయిపోయేది కదా అనిపించేది’ అంటూ కాజల్‌ చెప్పుకొచ్చారు.

అంతేకాక ‘ఇంత శ్రమకోర్చి తీసిన ఈ సన్నివేశం ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రిలోనే ఒక మైలురాయిగా నిలిచి పోయింది. కానీ ఇందులో నా గొప్పతనం ఏం లేదు. ఈ క్రెడిటంతా ఆదిదే’(దర్శకుడు ఆదిత్య చోప్రా) అంటూ కాజోల్ వివరించారు. 

Videos

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌