మౌంట్ షార్ప్ పర్వతపాదం చేరుకున్న క్యూరియాసిటీ

Published on Sun, 09/14/2014 - 23:56

వాషింగ్టన్: అంగారకుడిపై గేల్‌క్రేటర్ ప్రాంతంలో రెండేళ్ల క్రితం దిగిన క్యూరియాసిటీ శోధక నౌక ఎట్టకేలకు తన తుది గమ్యానికి చేరువైంది. గేల్‌క్రేటర్ మధ్యలో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్‌షార్ప్ పర్వతం వద్దకు క్యూరియాసిటీ చేరుకుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది.

భౌగోళికంగా ప్రత్యేకమైన పర్వత పాదం వద్ద కొంత అన్వేషణ తర్వాత రోవర్ ఐదున్నర కిలోమీటర్ల ఎత్తైన పర్వతం పైకి చరిత్రాత్మక ప్రయాణాన్ని ప్రారంభించనుంది. గేల్‌క్రేటర్‌లో 2012 ఆగస్టులో దిగిన క్యూరియాసిటీ తన రెండేళ్ల ప్రయాణంలో మార్స్‌పై ఒకప్పటి నీటి ప్రవాహ జాడలను కనుగొనడంతో పాటు అక్కడి శిలలు, మట్టిని విశ్లేషించి ఖనిజలవణాల సమాచారాన్ని, అనేక ఫొటోలను భూమికి పంపిన సంగతి తెలిసిందే.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ