amp pages | Sakshi

వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించే మొక్కజొన్న!

Published on Tue, 08/14/2018 - 04:51

పరస్పర ఆధారితంగా జీవించడమే ప్రకృతిలో అత్యద్భుతమైన సంగతి. సూక్ష్మజీవులు, మొక్కలు ఇచ్చి పుచ్చుకోవటం ద్వారా సజావుగా జీవనం సాగించడం విశేషం. మెక్సికో దేశంలో సియెర్ర మిక్సె అనే ఒక దేశవాళీ మొక్కజొన్న రకం.. తన పెరుగుదలకు అవసరమైన నత్రజనిని.. మేలుచేసే సూక్ష్మజీవరాశి ద్వారా సమకూర్చుకుంటూ.. సమస్యాత్మక నేలల్లోనూ నిక్షేపంగా చక్కని దిగుబడినిస్తోందని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. మొక్కజొన్న మొక్క కాండం కణుపుల వద్ద వేర్లు(ఏరియల్‌ రూట్స్‌) వంటివి పెరుగుతూ ఉంటాయి. కొన్ని మొక్కజొన్న జాతుల్లో బయట ఉండే ఈ వేర్లు పొడుగ్గా పెరిగి, భూమిలోకి చొచ్చుకెళ్తాయి కూడా. మొక్క పడిపోకుండా ఉండటానికి, నీటి తేమను అదనంగా గ్రహించడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి.

 అయితే, తాజా పరిశోధనలో తేలిందేమంటే.. మెక్సికోలోని ఓక్సక దగ్గర ఒక ప్రాంతంలో నత్రజని లోపించిన నేలల్లో దేశవాళీ రకం మొక్కజొన్న మొక్కలు రసాయనిక ఎరువులు పెద్దగా వాడకపోయినా లేదా అసలు వాడకపోయినా నిక్షేపంగా పెరుగుతూ చక్కగా దిగుబడినిస్తున్నాయి. దీనిపై కాలిఫోర్నియా యూనివర్సిటీ(డేవిస్‌)కు చెందిన ప్రొ. అన్‌ బెన్నెట్, అల్లెన్‌ వాన్‌ డెన్జ్‌ నేతృత్వంలో శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధన జరిపిన తర్వాత ఇటీవల నిర్ధారణకు వచ్చిందేమంటే.. సూక్ష్మజీవుల ద్వారా ఈ మొక్కజొన్న మొక్కలు నత్రజనిని అసాధారణంగా గ్రహిస్తున్నాయని!

మొక్కజొన్న మొక్కల కాండానికి ఉన్న కణుపుల దగ్గర గాలిలో తేలాడుతుండే వేర్లు(ఏరియల్‌ రూట్స్‌) ఒక రకమైన జిగురు వంటి తీపి ద్రవాన్ని స్రవిస్తుంటాయి. తద్వారా మేలు చేసే సూక్ష్మజీవరాశిని ఇవి ఆకర్షిస్తున్నాయి. మేలు చేసే సూక్ష్మజీవులు ఈ తీపి ద్రవాన్ని ఆహారంగా స్వీకరించి జీవిస్తూ.. అందుకు ప్రతిగా వాతావరణంలోని నత్రజనిని గ్రహించి మొక్కజొన్న మొక్క కణజాలానికి అందిస్తూ రుణం తీర్చుకుంటున్నాయి.  29–82% వరకు నత్రజనిని ఈ సూక్ష్మజీవులు మొక్కజొన్న మొక్కలకు అందిస్తున్నాయని తేలింది. పప్పుధాన్య పంటలు తమ వేరు వ్యవస్థలోని మేలు చేసే సూక్ష్మజీవుల ద్వారా వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తున్నాయని మనకు తెలుసు.

అయితే, ఏకదళ జాతికి చెందిన మెక్సికోకు చెందిన మొక్కజొన్న నత్రజనిని వాతావరణం నుంచి గ్రహిస్తుండటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచిన వాస్తవం! ప్రధాన ఆహార పంటయిన మొక్కజొన్న సాగులో శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేసిన రసాయనిక ఎరువులను ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా వాడుతున్న నేపథ్యంలో.. అసలు నత్రజని ఎరువులు వేయనవసరం లేని మొక్కజొన్న రకాలను, ఆ మాటకొస్తే జొన్న రకాలను సైతం సృష్టించడం సాధ్యపడవచ్చని ప్రొఫెసర్‌ బెన్నెట్, ఆయన సహచర శాస్త్రవేత్తలు ఉత్సుకతతో భావిస్తున్నారు. ‘కొన్ని దేశవాళీ మొక్కజొన్న రకాలు కొన్నిటికి వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించే శక్తి ఉన్న విషయం మాకు కొత్తేమీ కాదు. అయితే, సియెర్ర మిక్సె రకం దేశీ మొక్కజొన్నకు ఆ లక్షణం ఉంది? ఆ మొక్కకు అవసరమయ్యే నత్రజనిని సూక్ష్మజీవ రాశి ద్వారా ఎంతమేరకు వాస్తవంగా గ్రహిస్తున్నదీ నిర్ధారించుకోవడానికి, అనేక విభాగాల శాస్త్రవేత్తలు కలిసి పనిచేస్తే, మాకు పదేళ్లు పట్టింది’ అని ప్రొ. బెన్నెట్‌ అన్నారు.
 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)