More

సీమాంధ్ర బరిలో మిగిలింది వీరే

24 Apr, 2014 03:59 IST

సీమాంధ్రలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు నామినేషన్లు, ఉపసంహరణల ఘట్టానికి బుధవారం తెరపడింది. దీంతో 13 జిల్లాలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2,043 మంది, 25 లోక్‌సభ సీట్లకు 333 మంది చొప్పున అభ్యర్థులు బరిలో మిగిలారు. మే 7న జరిగే పోలింగ్ కోసం 71,282 పోలింగ్ స్టేషన్లను వినియోగించనున్నారు.
 
 బీజేపీతో పొత్తు కారణంగా టికెట్ కోల్పోయిన తెలుగు తమ్ముళ్లు రెబల్ అభ్యర్థులుగా కదనరంగంలో నిలవడంలో ముందున్నారు. అసలే బల‘హీన’ంగా ఉన్నామన్న మనోవేదన ఒకవైపు.. తమ్ముళ్ల అలకలు మరోవైపు టీడీపీ పార్టీకి శిరోభారంగా మారింది. కాంగ్రెస్ పార్టీ చిన్నాచితకా నేతల్ని అభ్యర్థులుగా ఖరారు చేసింది. మొత్తంగా పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి నామినేషన్ల దాఖలు వరకూ ఒకేమాటతో ఎన్నికల రంగంలోకి దూకింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

TS Election 2023: తొమ్మిది మంది 'సిట్టింగ్‌'లకు మళ్లీ చాన్స్‌!

వైద్య పరికరాల పరిశ్రమకు ఊతమివ్వండి 

బౌలింగ్‌ మరిచి ప్యాంటు లాగి.. అంపైర్‌ పరువు తీశాడు

మంచు లంచ్

చెంచాడు చక్కెర చాలు...