amp pages | Sakshi

విద్యుత్ సమస్యపై టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన

Published on Thu, 06/23/2016 - 01:05

నిరంతర విద్యుత్ అని చెప్పుకోవడం ఆత్మవంచనే: గౌతు శివాజీ
  విద్యుత్ కోతలపై సబ్‌స్టేషన్ వద్ద ధర్నా

 
 సోంపేట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంతరా యం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చె ప్పుకోవడం ఆత్మవంచన చేసుకోవడమేనని ప లాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ అన్నా రు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో విద్యు త్ సరఫరాలో సమస్య పరిష్కరిచాలంటూ ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి బుధవారం సోంపేట సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేశారు.
 
 సోంపేట మండలంలో మే నెల 15 నుంచి జూన్ 3 వరకు 20 రోజుల్లో ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా ఆపారో తెలపాలని ఎమ్మెల్యే శివాజీ సబ్‌స్టేషన్ ఏడీఈ అప్పారావుకు 20 రోజుల కిందట దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ సమాధానం రాలేదు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. బారువలోని ఓ కార్యక్రమానికి వచ్చిన వీరు ఆందోళన కు దిగడంతో సిబ్బంది కాస్త టెన్షన్ పడ్డారు. ఏఈ లక్ష్మణరావు, ఏడీఈ అప్పారావులను సమస్యలపై ప్రశ్నలు అడగ్గా... సమాధానాలు సరిగ్గా రాలేదు.
 
 ఈ ధర్నాపై కలెక్టర్ లక్ష్మీనృసింహం, జిల్లా ట్రాన్స్ కో ఎస్‌ఈ శరత్, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి  అచ్చెన్నాయుడు, సీఎం పేషీ అధికారులకు శివాజీ సమాచారం అందించారు. అలాగే 11 గంటల సమయంలో బరంపురం గ్రిడ్ మేనేజర్ అనిల్ కుమార్‌కు ఫోన్ చేసి విద్యుత్ అంతరాయానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. త ర్వాత సీఎం పేషీ అధికారి రాజ్‌గోపాల్‌తోనూ మాట్లాడారు. విశాఖ ట్రాన్స్‌కో సీఎండీ ముత్యాలరాజుతో కూడా ఫోన్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడారు.
 
 నిరంతర విద్యుత్ లేదు...
 గ్రామాల్లోకి వెళ్లి నిరంతర విద్యుత్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని ఎమ్మెల్యేలు అన్నారు. కలెక్టర్ ట్రాన్స్‌కో ఎస్‌ఈని వెనకేసుకు వస్తున్నారని ఆ రోపించారు. చివరకు టెక్కలి డీఈ జీఎన్ ప్రసాద్ వచ్చి అంతరాయానికి క్షమాపణలు చెప్పినా ఆం దోళన విరమించలేదు. ఆఖరకు ట్రాన్స్‌కో సీఎండీ విజయేందర్ హైదరాబాద్ నుంచి శివాజీతో ఫో న్‌లో మాట్లాడారు.
 
 సీఎండీ రాజు సమక్షంలో స మావేశం నిర్వహించి సమస్య పరిష్కరిస్తానని చె ప్పడంతో ఆందోళన విరమించారు. గ్రామాల్లో నిరంతర విద్యుత్ అందడం లేదని సీఎంకు చెప్పడానికే ఈ ఆందోళన చేసినట్లు శివాజీ తెలిపారు. ధర్నా చేస్తున్నామని కలెక్టర్, మంత్రికి చెప్పినా స్పందించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చే శారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు స్థానిక నాయకులు జెడ్పీటీసీ సూరాడ చంద్రమోహన్, మద్దిలి నాగేశ్వరరావు, గోపీ, తదితరులు పాల్గొన్నారు.
 
 కార్యక్రమంలో శివాజీ ఇచ్ఛాపురం ఎ మ్మెల్యే అశోక్‌తో మాట్లాడుతూ ‘ధర్నాతో నాకు ఎలాంటి సంబంధం లేదని సీఎంతో అనవద్దు’ అంటూ చలోక్తి విసిరారు. అనంతరం ఎస్‌ఈ జీఎ న్ ప్రసాద్ సోంపేట చేరుకుని విద్యుత్ శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారుల్లో సమన్వయం లేకపోవడంతో ఇలా జరుగుతందన్నారు. అధికారులు సమన్వయం చేసుకుని విద్యుత్ సరఫరాలో  ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను కోరారు.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)