More

ఉద్యోగం ఇప్పిస్తానని.. అత్యాచారం

4 May, 2016 02:23 IST

పోలీసులు అదుపులో నిందితుడు
కామాంధుడిపై కిడ్నాప్, అత్యాచారం, నిర్భయ కేసులు

గండేడ్/కీసర : ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. మరోఘటనలో నాలుగేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలు గండేడ్ మండలం గాధిర్యాల్, కీసర మండలం అహ్మద్‌గూడ రాజీవ్‌గృహకల్పకాలనీలలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గండేడ్ మండలం గాధిర్యాల్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువతి కుల్కచర్లలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.

ప్రస్తుతం సెలవులు కావడంతో తల్లిదండ్రులు, అక్కాబావలు పరిగిలో పనులు చేస్తుండడంతో అక్కడికి వెళ్లింది. అక్కడ మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం, సంపల్లి గ్రామానికి చెందిన చెన్నప్ప పరిచయమయ్యాడు. అయితే మైనర్‌బాలికపై చెన్నప్ప కన్నుపడింది.  ‘ఇంతచదువుకుని కూలీపని ఎందుకు చేస్తావు.. నీకు ఆర్టీసీలో కండక్టర్  ఉద్యోగం ఇప్పిస్తా’ అని నమ్మబలికాడు. దీనిని నమ్మిన అమ్మాయి ఇంట్లో ఎవరికి చెప్పకుండా సర్టిఫికెట్లతో 25 రోజుల క్రితం చెన్నప్ప వెంట వెళ్లిపోయింది. అమ్మాయి శారీరకంగా లోబర్చుకుని పలుమార్లు ఆమె పై అత్యాచారం చేశాడు.

అమ్మాయి అదృశ్యమైన విషయాన్ని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని వెతికే సమయంలో ఈనెల 2న మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో హోటల్‌లో టిఫిన్ చేస్తూ పోలీసులకు చి క్కారు. బాలిక తండ్రి కుర్మయ్య ఫిర్యా దు మేరకు కిడ్నాప్, అత్యాచారం, నిర్భయచట్టం కింద వివిధ సెక్షన్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహమ్మదాబాద్ ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. డీఎస్పీ విచారణ చేసే వరకు నిందితుడిని వదలకుండా పోలీసుస్టేషన్‌లోనే ఉంచుకోవాలని బాలలహక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు, పలు సంఘాలు పోలీసులను కోరారు.

నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నం..
కీసర మండలం అహ్మద్‌గూడ రాజీవ్‌గృహకల్పకాలనీలో నివాసముండే 18 ఏళ్ల వయస్సున్న అజయ్ స్థానిక చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ప్లాస్టిక్ బకెట్ల తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా మంగళవారం ఉదయం అదే కాలనీలో నివాసం ఉండే నాలుగేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటోంది. పక్కప్లాట్‌లో ఉండే అజయ్  చిన్నారిని ఆడుకుందామని పక్కకు తీసుకెళ్లి సెల్‌ఫోన్‌లో అసభ్య చిత్రాలను చూపిస్తూ చిన్నారిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన చిన్నారి తల్లిదండ్రులు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు కూడా అక్కడి చేరుకుని అజయ్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌