amp pages | Sakshi

మోల్డ్‌టెక్‌ మరో రెండు ప్లాంట్లు

Published on Tue, 06/04/2019 - 07:42

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ రంగ సంస్థ మోల్డ్‌టెక్‌ మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. 2,000 టన్నుల వార్షిక తయారీ సామర్థ్యంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్తరాదిన ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సుమారు రూ.15 కోట్లు వెచ్చించనుంది. అలాగే హైదరాబాద్‌ సమీపంలోని సుల్తాన్‌పూర్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో మరో ప్లాంట్‌ రానుంది. రెండేళ్లలో ఇది సిద్ధం కానుంది. 10–12 వేల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రానున్న ఈ కేంద్రానికి సుమారు రూ.60 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ సీఎండీ జె.లక్ష్మణ రావు ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.

నష్టాలు వస్తున్నందునే..
కంపెనీకి యూఏఈలోని రస్‌ అల్‌ ఖైమాలో 3,000 టన్నుల కెపాసిటీ గల ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌ ప్లాంటు ఉంది. గత మూడేళ్లలో ఈ యూనిట్‌ ద్వారా కంపెనీకి సుమారు రూ.11 కోట్ల నష్టం వచ్చింది. ఇరాన్, ఇరాక్‌కు సరఫరాలపై నిషేధం ఉండడంతో పాటు ఆర్థికంగా సంస్థకు అక్కడి మార్కెట్‌ కలిసి రాలేదు.  అక్కడి పెయింట్‌ కంపెనీలింకా ప్యాకేజింగ్‌ కోసం టిన్‌నే వినియోగిస్తున్నాయి. భారత్‌లో మాదిరి ప్యాకేజింగ్‌కు టిన్‌ నుంచి ప్లాస్టిక్‌కు మళ్లుతాయని భావిం  చిన మోల్డ్‌టెక్‌కు నిరాశే మిగిలింది. దీంతో ప్లాం టును మూసేసి మెషినరీని భారత్‌లోని ప్లాంట్‌లకు తరలించింది.  రూ.11 కోట్లను రైటాఫ్‌ చేసింది.

ఈ ఏడాది 20 శాతం వృద్ధి..
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మూలధన వ్యయం రూ.75 కోట్లు. 2019–20లో ఇది రూ.30 కోట్లకు పరిమితం కానుంది. ఇందులో రూ.15 కోట్లు ఉత్తరాది ప్లాంటుకు, మిగిలిన మొత్తం సామర్థ్యం పెంపునకు వినియోగిస్తారు. మైసూరు యూనిట్‌ ఫిబ్రవరిలో, వైజాగ్‌ కేంద్రం మార్చి నుంచి అందుబాటులోకి వచ్చాయి. వీటికి రూ.45 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కొక్కటి 3,000 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది ఈ 2 యూనిట్ల సామర్థ్యం పూర్థి స్థాయిలో తోడవనుంది. హైదరాబాద్, డామన్, హోసూరు, సతారా ప్లాంట్లతో కలిపి మొత్తం సామర్థ్యం 38,000 టన్నులకు చేరుకుంది. 2019–20లో టర్నోవర్‌లో 20% వృద్ధిని మోల్డ్‌టెక్‌  ఆశిస్తోంది. 2018–19లో కంపెనీ రూ.407 కోట్ల టర్నోవర్‌పై రూ.32 కోట్ల నికరలాభం ఆర్జించింది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)