amp pages | Sakshi

శిశుపాలుడికి ప్రతిరూపం చంద్రబాబు: వైఎస్‌ జగన్‌

Published on Tue, 03/19/2019 - 15:58

సాక్షి, అవనిగడ్డ: గత ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు అనేక హామీలను ఇచ్చారని, సీఎం అయ్యాక ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి పేదవాడి కష్టాలను దగ్గరుండి చూశానని, వారందరికీ నేనున్నానని అని భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు శిశుపాలుడు వంటి రాక్షసుడని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. శిశుపాలుడి తప్పులను చూసి దేవుడు విష్ణుచక్రంతో ఆయనను వధించాడని, అలాంటి విష్ణుచక్రం లాంటిదే మన ఫ్యాను చక్రమని జగన్‌ వర్ణించారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు వందకు పైగా తప్పులు, మోసాలు, కుట్రలు చేశారని మండిపడ్డారు.
చదవండి: (అడుగడుగునా అన్యాయం.. అబద్ధాలు)

ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చే మూడువేల రూపాయలను తీసుకుని మోసపోవద్దని, మరో 20 రోజులు ఓపిక పడితే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. నవరత్నాలు ద్వారా ప్రతి పేదవాడి జీవితాలు మారిపోతాయని, ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి​ చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కృష్ణాజిల్లా అవనిగడ్డలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
చదవండి:(కొండంత అండగా నేనున్నాను: వైఎస్‌ జగన్‌)

సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... ‘‘గత ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చిన చంద్రబాబు వాటిలో ఏవీ కూడా అమలుచేయలేదు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా అనేక హామీలను ఇచ్చారు. ఇదే కృష్ణా జిల్లాకు సంబంధించి.. మచిలీపట్నం పోర్టు, స్మార్ట్‌సిటీ, పుడ్‌పార్క్‌, ఐటీహబ్‌, మామిడి పరిశోధనా కేంద్రం, మెట్రోరైలు నిర్మిస్తామని అన్నారు. ఐదేళ్లు గడిచినా వాటి ఊసేలేదు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో కూర్చోని ఇక్కడి ఇసుకను అక్రమంగా తరలిస్తూ.. ఇసుక మాఫియాను చేస్తున్నారు. కృష్ణా జిల్లాను కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌కు కేంద్రంగా మార్చారు. కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేసిన ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు. జిల్లా కేంద్రంలో టీడీపీ నేతలు ఐపీఎస్‌ అధికారిని చొక్కాపట్టుకుని లాగితే సీఎం కనీసం చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు 60 నెలల పాలనలో 57 నెలలు ప్రజలకు నరకం చూపించారు. చివరి మూడు నెలలు రోజుకో సినిమా చూపిస్తున్నారు. ఇలాంటి పరిపాలన మనకు మరోసారి అవసరమా? గతంలో చంద్రబాబు పదేళ్ల పాలనతో విసిగిపోయిన ప్రజలు.. వైఎస్సార్‌ను గెలిపిస్తే.. ఆయన పాలన చూసి రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. అలాగే వైఎస్సార్‌సీపీ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అలాంటి పాలన మళ్లీ మీకు అందిస్తా. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా ప్రతి పేదవాడికి సంక్షేమ పథాకాలు అందేలా చేస్తా.

రైతులు, డ్వాక్రా మహిళలు, బడుగుబలహీన వర్గాలు, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. పేదవాడితో రాజకీయం చేసిన చరిత్ర చంద్రబాబుది. ప్రజలకు ఏమైనా అవసరం ఉంటే ఈ ప్రభుత్వంలో మొదట జన్మభూమి కమిటీని సంప్రదించాలి. అక్కడికి వెళ్లితే వారు ఏ పార్టీ అని అడుగుతారు. పేదలతో రాజకీయం ఏంది బాబు? పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీ రామారావుకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఇక ప్రజలను మోసం చేయడం ఆయనకు చాలా తేలిక. మనందరి మంచికే మొదటి విడతలోనే ఎన్నికలు వచ్చాయి. త్వరలోనే ఈ అవినీతి పాలనను అంతం చేసి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. చదువుకు దూరమైన ప్రతి పిల్లవాడిని చదివిస్తాం. పిల్లల్ని బడికి పంపిన ప్రతి తల్లికి ఏడాదికి 15000 రూపాయలు అందిస్తాం. డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాం. నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందేలా పరిపాలన అందిస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌